2. కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి డీఏలను రీస్టోర్ చేయడంతో పాటు 2021 జూలై, 2022 జనవరి డీఏలను కూడా పెంచింది. అయితే 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల డీఏ బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ బకాయిల కోసం, పెన్షనర్లు డీఆర్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ సమాచారం ప్రకారం స్వచ్ఛంద సంస్థల స్టాండింగ్ కమిటీ 32వ సమావేశంలో డీఏ, డీఆర్ బకాయిల రీస్టోర్పై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. పెన్షన్ నియమాల పరిశీలన, హేతుబద్ధీకరణ కోసం కేంద్ర పెన్షనర్ల సంక్షేమ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకొంతకాలం డీఏ, డీఆర్ బకాయిల కోసం ఎదురుచూడాల్సిందే. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన డీఏ, డీఆర్ బకాయిల మొత్తం రూ.34,402 కోట్లు ఉన్నట్టు గతంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీఏ, డీఆర్ బకాయిల్ని విడుదల చేస్తే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ బకాయిల్ని విడుదల చేస్తే ఉద్యోగులకు ఒకేసారి రూ.2,00,000 పైనే అకౌంట్లో జమ కానుంది. లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య, లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 మధ్య జమకావాల్సి ఉంది. ఇక లెవెల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)