2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం కింద ప్రస్తుతం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ అంటే హోమ్ లోన్ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు 2023 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. వాస్తవానికి గతంలో వడ్డీ రేట్ ఎక్కువగా ఉండేది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రభుత్వం తగ్గించడంతో 2023 మార్చి 31 వరకు 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అయితే మార్చి 31 తర్వాత ఈ వడ్డీ రేటు పెరుగుతుందని తాజాగా వార్తలొస్తున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్నది ఆ వార్తల సారాంశం. (ప్రతీకాత్మక చిత్రం)
4. హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ నియమనిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వడ్డీతో కూడిన అడ్వాన్సులు పొందడానికి అర్హులు. కొత్త ఇంటిని నిర్మించడం, ఇంటి కోసం ప్లాట్‌ను కొనుగోలు చేయడం, వారి నివాస స్థలాన్ని విస్తరించడం, హౌసింగ్ బోర్డులు, డెవలప్మెంట్ అథారిటీస్, రిజిస్టర్డ్ బిల్డర్ల నుండి ముందుగా నిర్మించిన గృహాలు లేదా అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడం లాంటి వాటికి అడ్వాన్స్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ 2017 రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 నెలల బేసిక్ వేతనాన్ని హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి రూ.25 లక్షలు. ఒకవేళ రూ.25 లక్షల లోపు ఇల్లు లేదా అపార్ట్మెంట్ తీసుకుంటే ఆ మొత్తానికి మాత్రమే లోన్ వస్తుంది. ఇక ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించేందుకు కూడా హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ ఉపయోగించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ నిబంధన ప్రకారం 34 నెలల బేసిక్ వేతనం హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్‌గా లభిస్తుంది. గరిష్ట పరిమితి రూ.10 లక్షలు. హెచ్‌బీఏ పొందేందుకు కనీసం 10 ఏళ్ల నిరంతర సర్వీసు అవసరం. అయితే దీన్ని 5 ఏళ్లకు తగ్గించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే, ఇద్దరికీ విడివిడిగా HBA అనుమతించబడాలని సిఫార్సు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)