1. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు,పెన్షనర్లకు ఏడో పే కమిషన్ (7th Pay Commission) సిఫార్సుల్ని అమలు చేస్తోంది. ఈ కమిషన్ సిఫార్సు మేరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనాలు లభిస్తుంటాయి. దీనికన్నా ముందు ఆరో పే కమిషన్ ఉండేది. త్వరలో ఏడో పే కమిషన్‌ను ఎనిమిదో పే కమిషన్‌తో కేంద్ర ప్రభుత్వం రీప్లేస్ చేయనుందని తాజాగా వార్తలొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటును డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2023 లోనే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్‌ను రీప్లేస్ చేయనుందని వార్తలొచ్చాయి. కానీ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎనిమిదో పే కమిషన్‌కు సంబంధించిన ప్రకటన ఏదీ రాలేదు. దీంతో ఉద్యోగులు నిరాశ చెందారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. కాబట్టి వచ్చే ఏడాదిలోగా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేస్తారని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే ఏడాదిలోగా ఏడో పే కమిషన్‌ను ఎనిమిదో పే కమిషన్‌తో రీప్లేస్ చేస్తారన్నది తాజా వార్తల సారాంశం. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు కూడా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ నెరవేరుస్తుందని భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించవచ్చని ఒక వాదన ఉంది. తద్వారా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికలకు ముందు ప్రోత్సాహాన్ని అందించినట్టవుతుంది. లేకపోతే ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కమిషన్ ఏర్పాటు చేయొచ్చన్నది మరో వాదన. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ లెక్కన 7వ వేతన సంఘం స్థానంలో 8వ వేతన సంఘం ప్రకటన 2024 చివరి నాటికి రావొచ్చు. ఈ సిఫార్సులు 2026 నాటికి అమలు చేస్తారు. 8వ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు అత్యల్ప స్థాయి నుంచి అత్యధిక స్థాయి జీతాల స్థాయికి భారీ వేతనాన్ని పెంచడం, బేసిక్ వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సుల పెంపు లాంటివాటిపై సిఫార్సులు చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)