1. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2022 జూలైకి సంబంధించిన డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) 4 శాతం పెంచింది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (DR) కూడా పెరుగుతుంది. పెరిగిన డీఏ ప్రకారం ఉద్యోగులకు వేతనాలు, పెరిగిన డీఆర్ ప్రకారం పెన్షనర్లకు పెన్షన్ లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇక ఉద్యోగులకు మళ్లీ 2023 జనవరిలో డీఏ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరిలో ఓసారి, జూలైలో ఓసారి ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంచుతుంది. ఇక ఉద్యోగులకు 18 నెలల డియర్నెస్ అలవెన్స్ బకాయిలు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం డీఏ నిలిపివేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మళ్లీ 18 నెలల తర్వాతే డీఏ రీస్టోర్ చేసింది. డీఏ పెంచి వేతనాలు అందించింది.అయితే 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. డీఏ బకాయిల్ని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో విడుదల చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కానీ సింగిల్ సెటిల్మెంట్లో రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల వ్యవహారంపై ఇప్పుడు మళ్లీ కదలిక వచ్చింది. డీఏ బకాయిలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్లు పెరుగుతుండటంతో వీలైనంత త్వరలోనే కేంద్ర ప్రభుత్వం డీఏ బకాయిలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం సింగిల్ సెటిల్మెంట్లో డీఏ బకాయిల్ని రిలీజ్ చేస్తే ఉద్యోగుల అకౌంట్లోకి రూ.2 లక్షల పైనే జమ కానున్నాయి. లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య, లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 మధ్య, లెవెల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2.57గా ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 చేయాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చివరిసారిగా 2016లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచిన సంగతి తెలిసిందే. అప్పుడు ఉద్యోగుల బేసిక్ వేతనం రూ.6,000 గా ఉంటే రూ.18,000 చేశారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచితే బేసిక్ వేతనం సుమారు రూ.26,000 కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)