కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. జనవరి 31 తర్వాత జీతాలు పెరగనున్నాయి. డియర్నెస్ అలవెన్స్(Dearness Allowence)ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 31 తర్వాత ఈ నిర్ణయం వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మూల వేతనం(బేసిక్ పే)లో 38శాతం డియర్నెస్ అలవెన్స్ అందిస్తోంది. దీనిని 3శాతం మేర పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వేతన జీవులకు డియర్నెస్ అలవెన్స్ 41 శాతానికి చేరుకోనుంది. ఫలితంగా మొత్తం వేతనాల్లో మార్పులు జరగనున్నాయి. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నందున ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.