కాగా డియర్నెస్ అలవెన్స్ అనేది ఏటా రెండు సార్లు పెరుగుతూ వస్తుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకసారి డీఏ పెంచుతారు. అలాగే జూలై నుంచి డిసెంబర్ కాలానికి మరోసారి డీఏను సవరిస్తారు. ఇలా ఏడాదిలో రెండు సార్లు డీఏ పెరుగుతుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏ సవరణ ఉంటుంది. డీఏ పెరుగుదల వల్ల ఇటు ఉద్యోగులకు, అటు పెన్షనర్లకు బెనిఫిట్ కలుగుతుంది.