6. 2017 జూన్లో ఏడో పే కమిషన్ సూచించిన 34 మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఎంట్రీ లెవెల్ బేసిక్ పే రూ.7,000 నుంచి రూ.18,000 కి పెరిగింది. ఇక ఉన్నతస్థాయి అంటే సెక్రెటరీ బెసిక్ వేతనం రూ.90,000 నుంచి రూ.2,50,000 కి పెరిగింది. క్లాస్ 1 అధికారుల ప్రారంభ వేతనం రూ.56,100 గా సిఫార్సు చేసింది ఏడో పే కమిషన్. (ప్రతీకాత్మక చిత్రం)
7. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని ఆర్థిక సలహా కమిటీ నివేదికను ప్రధాన మంత్రికి పంపింది. సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు పదవీ విరమణ వయస్సు పెంచాలని ఆ కమిటీ సూచించింది. దీంతో పాటు 50 ఏళ్లు దాటిన ఉద్యోగుల స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆ నివేదికలో వివరించింది. మరోవైపు దేశంలో వృద్ధులకు ప్రతీ నెలా కనీసం రూ.2,000 పెన్షన్ ఇవ్వాలని కమిటీ వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)