1. ఏడో పే కమిషన్ (7th Pay Commission) సిఫార్సుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు త్వరలో శుభవార్తలు రాబోతున్నాయి. ఒకటి కాదు... ఏకంగా రెండు శుభవార్తలు వినిపించబోతోంది మోదీ ప్రభుత్వం. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏకంగా రూ.2,18,200 వరకు ప్రయోజనాలు అందబోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA) బకాయిలు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు 18 నెలల డీఏ బకాయిలు ఉద్యోగులకు, డీఆర్ బకాయిలు పెన్షనర్లకు రావాల్సి ఉంది. వీటిని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది మోదీ ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2020 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం డీఏ, డీఆర్ చొప్పున, 2020 జూలై నుంచి 2020 డిసెంబర్ వరకు 3 శాతం డీఏ, డీఆర్ చొప్పున, 2021 జనవరి నుంచి 2021 జూలై వరకు 4 శాతం డీఏ, డీఆర్ చొప్పున పెండింగ్లో ఉంది. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బకాయిల రిలీజ్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. సుమారు 1.14 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఈ మొత్తం రూ.34,402 కోట్లు ఉంటుందని అంచనా. ఉద్యోగుల బేసిక్ వేతనాన్ని బట్టి లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య డీఏ బకాయిలు విడుదల కావచ్చని అంచనా. ఇక లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచుతుంది. జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి డీఏ, డీఆర్ పెరుగుతుంది. ఈ ఏడాదికి సంబంధించి జనవరిలో 4 శాతం, జూలైలో 3 శాతం డీఏ, డీఆర్ పెరిగింది. ఇప్పుడు జనవరి కూడా వచ్చేసింది. జనవరిలో కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు మరోసారి డీఏ, డీఆర్ పెరగనుందని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
6. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2020 జనవరి కన్నా ముందు 17 శాతం డీఏ ఉండేది. 2020 జనవరిలో 4 శాతం, 2020 జూలైలో 3 శాతం, 2021 జనవరిలో 4 శాతం డీఏ పెరిగింది. ఈ మూడు డీఏలను ఒకేసారి రీస్టోర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో డీఏ ఒకేసారి 17 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్లో 2021 జూలైకి సంబంధించిన డీఏ 3 శాతం పెరిగింది. దీంతో ఉద్యోగులకు ప్రస్తుతం 31 శాతం డీఏ లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. 2022 జనవరిలో డీఏ, డీఆర్ ఎంత పెరగొచ్చన్న చర్చ జరుగుతోంది. జనవరిలో 2 నుంచి 3 శాతం డీఏ పెరగొచ్చని అంచనా. మరోవైపు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే బేసిక్ వేతనం రూ.18,000 నుంచి రూ.26,000 కావొచ్చని భావిస్తున్నారు. చివరిసారిగా 2016లో బేసిక్ వేతనాన్ని రూ.6,000 నుంచి రూ.18,000 చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి బేసిక్ వేతనం పెరిగే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. బేసిక్ వేతనం పెరిగితే డీఏ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అందించే డీఏను బేసిక్ వేతనంపైనే లెక్కిస్తారు. అంటే ఇప్పటి వరకు రూ.18,000 బేసిక్ వేతనానికి 31 శాతం అంటే రూ.5580 డీఏ లభించేది. బేసిక్ వేతనం రూ.26,000 చొప్పున లెక్కిస్తే డీఏ రూ.8,060 లభించనుంది. ఇక 2022 జనవరిలో డీఏ 3 శాతం పెరిగితే 34 శాతం డీఏ లభించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)