* ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం : పెట్టుబడి విషయంలో యువతకు అతి పెద్ద డ్రాబ్యాక్స్లో ఒకటి ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy)లేకపోవడం. ఈ వ్యవస్థ గురించి తెలియనంత వరకు, అర్థం చేసుకోనంత వరకు వారు సరైన నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదా రిస్క్ డైవర్సిఫికేషన్ వంటి బేసిక్ కాన్సెప్ట్‌లను యువత అర్థం చేసుకోలేరు. ఫలితంగా వారు సులభంగా ఖరీదైన తప్పులు చేస్తుంటారు.
ఈ పొరపాటును నివారించడానికి ఒక మార్గం ఏమిటంటే, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించడానికి ముందు వ్యక్తిగత ఫైనాన్స్, పెట్టుబడి గురించి అవగాహన పొందాలి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పుష్కలంగా సోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. పుస్తకాలు, కథనాలు, పెట్టుబడి బేసిక్స్ బోధించే కోర్సులను కూడా కనుగొనవచ్చు. బేసిక్స్ బాగా అర్థం చేసుకున్న తర్వాత, పెట్టుబడుల గురించి నిర్ణయాలు తీసుకోవడానికి మెరుగైన స్థితిలో ఉంటారు.
* స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి ప్రణాళిక లేకపోవడం : పెట్టుబడి విషయంలో యువత చేసే మరో తప్పు.. స్పష్టమైన లక్ష్యాలు, రోడ్‌మ్యాప్ లేకుండా ముందుకెళ్లడం. చాలా తరచుగా, యువకులు తమ లక్ష్యాల గురించి లేదా వాటిని ఎలా సాధించాలనుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచించకుండా పెట్టుబడి పెడతారు. ఫలితంగా వారు తమ ప్రయోజనాలకు అనుకూలంగా లేని నిర్ణయాలు తీసుకుంటారు. స్పష్టమైన పెట్టుబడి ప్రణాళిక లేకుండా, తెలివైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. లక్ష్యాలు ఏమిటో తెలియకుండా, వాటిని సాధించడంలో ఎలాంటి పెట్టుబడులు సహాయపడతాయో తెలుసుకోవడం కష్టం.
* స్వల్పకాలిక లాభాలపై దృష్టి : స్వల్పకాలిక లాభాలు మంచివే కానీ తాత్కాలికమే. యువత పెట్టుబడిపై త్వరగా లాభం పొందడాన్ని చూస్తారు. అయితే పెట్టుబడి లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ప్రమాదకరమైన మార్గం. పెట్టుబడి పెట్టడం అనేది దీర్ఘకాలికంగా ఉండాలి. పెట్టుబడిని విక్రయించడం ద్వారా త్వరగా లాభం పొందగలిగే సందర్భాలు ఉంటాయి, కానీ అది ప్రాథమిక లక్ష్యం కాకూడదు. కాలక్రమేణా వృద్ధి చెందే పెట్టుబడులను కనుగొనడం, భవిష్యత్తులో ఆర్థిక భద్రతను అందించడం లక్ష్యంగా ఉండాలి. పెట్టుబడి అనేది మారథాన్ అని గుర్తుంచుకోవడం ముఖ్యం, స్ప్రింట్ కాదు.
* పోర్ట్‌ఫోలియోను డైవెర్సిఫై చేయకపోవడం : కేవలం ఒక కంపెనీ లేదా ఒక రంగంలో లేదా ఒక ఫైనాన్షియల్ ప్రొడక్టులో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం. వివిధ కంపెనీలు, రంగాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా పోర్ట్‌ఫోలియోను డైవెర్సిఫై చేసుకోవచ్చు. డైవర్సిఫికేషన్ అనేది రిస్క్ మేనేజ్మెంట్లో కీలకమైన భాగం. యువత ఈ అసెట్ అలొకేషన్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. స్టాక్‌లు, బాండ్లు, ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ వంటి వాటిని పరిశీలించాలి.
* భావోద్వేగాల ఆధారంగా పెట్టుబడి పెట్టడం : చాలా మంది యువకులు అది తెలివైన పెట్టుబడి అవునా? కాదా? అని ఆలోచించకుండా, తమకు మక్కువ ఉన్న వాటిపై పెట్టుబడి పెడతారు. దీని వల్ల డబ్బును పోగొట్టుకుంటారు. పెట్టుబడి నిర్ణయాలు ఉద్వేగభరితంగా కాకుండా పరిశోధన ఆధారితంగా ఉండాలి. ఆర్థిక విద్య ఈ అంశాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మార్కెట్ అధ్యయనాలు, ధోరణుల ఆధారంగా ప్రాక్టికల్ నిర్ణయాల ఆధారంగా పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు, ముఖ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడు, ఎక్కువ అనుభవం లేనప్పుడు కష్టమైన వ్యవహారం. పెట్టుబడి బేసిక్స్‌పై అవగాహన చేసుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తే తప్పులు నివారించవచ్చు.