Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్... 2 kWh 48V 39 Ah మార్చుకోగల బ్యాటరీని కలిగివుంది. దీని ధర రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ EV గరిష్ట వేగం గంటకు 65 కి.మీ. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఇందులో ఎకో, స్పోర్ట్ అనే రెండు రైడ్ మోడ్లు ఉన్నాయి. (న్యూస్ 18 ఫైల్ ఫొటో)
ఎలక్ట్రిక్ స్కూటర్ , బౌన్స్ ఇన్ఫినిటీ e1, హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సిఎక్స్, ఆంపియర్ మాగ్నస్ x, హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్, ఒకినావా ప్రశంస ప్రో, ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, తెలుగు వార్తలు, తాజా తెలుగు వార్తలు," width="1200" height="900" /> Hero Optima CX స్కూటర్.. 550W BLDC మోటార్‌తో ఉంది. ఇది 52.2V, 30Ah లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో వచ్చింది. పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. స్కూటర్ ధర రూ.62,190 నుంచి ప్రారంభమవుతుంది. ఇది డబుల్ బ్యాటరీ వేరియంట్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కిమీ వెళ్తుంది. గంటకు 45 కి.మీ. వేగంతో వెళ్తుంది. (న్యూస్ 18 ఫైల్)
Ampere Magnus EX స్కూటీ.. ఒక LCD స్క్రీన్, ఒక ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారంను కలిగి ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. 5 amp సాకెట్ని ఉపయోగించి 0-100% ఛార్జ్ చేయడానికి స్కూటర్‌కి 6-7 గంటలు పడుతుంది. Magnus EX 121 kms ARAI- ధృవీకరించిన పరిధిని నిరూపిస్తుంది. దీని ధర రూ.73,999 నుంచి ప్రారంభమవుతుంది. (న్యూస్ 18 ఫైల్ ఫొటో)
Hero Electric Photon 72V స్కూటర్... 26 Ah బ్యాటరీ ప్యాక్‌ను కలిగివుంది. ఇది 1200W మోటార్‌కు కనెక్ట్ అయి ఉంది. బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జింగ్‌పై 90 కిమీలు వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీ. ఫీచర్ల పరంగా దీనికి LED హెడ్‌లైట్, టెయిల్ లైట్‌తో పాటు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని ధర రూ.80,790 నుంచి ప్రారంభమవుతుంది. (న్యూస్ 18 ఫైల్ ఫొటో)
Okinawa Praise Pro గరిష్ట వేగం గంటకు 58 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 88 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 2-3 గంటలు పడుతుంది. ఈ స్కూటర్లో 'స్పోర్ట్ మోడ్' కూడా ఉంది. స్కూటర్లో కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంట్రల్ లాకింగ్, పూర్తిగా డిజిటల్ LCD కన్సోల్, సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర 87,593 నుంచి ప్రారంభమవుతుంది. (న్యూస్ 18 ఫైల్ ఫొటో)