1. ఇండియా కవాసాకి మోటార్స్ 2023 నింజా 650 బైక్‌ను (2023 Kawasaki Ninja 650) భారతీయ రోడ్లపైకి తీసుకొచ్చింది. అదిరిపోయే ఫీచర్స్‌తో ఈ స్పోర్ట్స్ బైక్‌ను లాంఛ్ చేసింది. 2023 నింజా 650 స్పోర్ట్స్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.12 లక్షలు. లైమ్ గ్రీన్ కలర్లో ఈ బైక్‌ను పరిచయం చేసింది. (image: Kawasaki India)
2. లేటెస్ట్ కవాసాకి నింజా 650 బైక్‌లో కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఉండటం విశేషం. దీంతో పాటు డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ కూడా ఉంది. MY2022 వర్షన్‌తో పోలిస్తే ధర రూ.17,000 ఎక్కువగా ఉంది. కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లో రెండు మోడ్స్ ఉంటాయి. తడిగా ఉన్న రోడ్లపై మోడ్ 2 బాగా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. (image: Kawasaki India)
3. 2023 నింజా 650 బైక్‌లో 649సీసీ ప్యారలల్ ట్విన్ బీఎస్6 ఇంజిన్ ఉంది. 8,000 ఆర్పీఎం దగ్గర 67 బీహెచ్పీ, 6,700 ఆర్పీఎం దగ్గర 64 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. సస్పెన్షన్ డ్యూటీలలో 41 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ ఉన్నాయి. (image: Kawasaki India)
4. బైక్‌లో డ్యూయల్-పిస్టన్ కాలిపర్లతో ముందు భాగంలో 300 మిమీ డ్యూయల్ పెటల్ డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో ఒకే 220 మిమీ పెటల్ డిస్క్‌ను ఉపయోగించారు. నింజా 650 డన్లప్ స్పోర్ట్‌మ్యాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లు ఉన్నాయి. ఇక మిగతా ఫీచర్స్ చూస్తే పాత మోడల్లో ఉన్నట్టుగానే ఉన్నాయి. (image: Kawasaki India)