1. మారుతి సుజుకి తయారు చేసిన కార్లు ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్లో కూడా సక్సెస్ అయ్యాయి. అయితే కంపెనీ భారత్‌లో నిలిపివేసిన ఒక మోడల్‌కు హైబ్రిడ్ వెర్షన్‌ను సుజుకి యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 2022 S-క్రాస్ ఫుల్ హైబ్రిడ్ వెర్షన్ కారును సుజుకి కంపెనీ తాజాగా రిలీజ్ చేసింది. (Photo: Suzuki)
2. S-క్రాస్ మోడల్‌ను మారుతి సుజుకి భారత మార్కెట్లో నిలిపివేసింది. తర్వాత 2021లో S-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది సుజుకి బ్రాండ్. దీంట్లో తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్‌ను కంపెనీ అందించింది. అయితే ఇప్పుడు సుజుకి యూరోపియన్ మార్కెట్లలో S-క్రాస్ ఫుల్ హైబ్రిడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. (Photo: Suzuki)
4. ఎస్-క్రాస్ టాప్ ఎండ్ అయిన అల్ట్రా వేరియంట్లో ALLGRIP సెలెక్ట్ ఫోర్-వీల్ డ్రైవ్ టెర్రైన్ మోడ్స్, 17 అంగుళాల పాలిష్డ్ అల్లాయ్ వీల్స్, లెదర్ సీట్ అప్హోల్స్టరీ, 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హీటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. (Photo: Suzuki)
5. బేస్ వేరియంట్ అయిన మోషన్ మోడల్లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED DRLలు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, యాపిల్ కార్ ప్లే తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ ఇంజిన్.. వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ A/C ఈ కారులోని మరో స్పెషాలిటీ. (Photo: Suzuki)
6. 2022 S-క్రాస్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కస్టమర్లు 1.4 లీటర్ బూస్టర్‌జెట్ మైల్డ్-హైబ్రిడ్, 1.5 లీటర్ NA స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌తో కారును సెలక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్.. 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో పాటు 140V లిథియం-అయాన్ బ్యాటరీ, ఇన్వర్టర్, మోటార్ జనరేటర్ యూనిట్, 12V లిథియం-అయాన్ అండ్ లెడ్-యాసిడ్ బ్యాటరీలతో వస్తుంది. (Photo: Suzuki)
7. ఈ ఇంజిన్ 115 bhp పవర్‌ను, 138 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్ అయి ఉంటుంది. ఇలాంటి స్పెసిఫికేషన్లతో ఈ హైబ్రిడ్ S-క్రాస్ కేవలం 12.5 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. కారు గరిష్ట వేగం 175 kph అని సుజుకి పేర్కొంది. అయితే 1.4 లీటర్ బూస్టర్‌జెట్ ఇంజిన్ 129 బీహెచ్పీ పవర్, 235 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. (Photo: Suzuki)
8. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లింక్ అయ్యి ఉంటుంది. ఈ కెపాసిటీతో లేటెస్ట్ S-క్రాస్ కేవలం 9.5 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకోగలదని సుజుకి పేర్కొంది. వెహికల్ టాప్ స్పీడ్ 195 కి.మీ.గా ఉంది. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, స్పీడ్ లిమిటర్ ఉన్న అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్ వంటి సేఫ్టీ ఫీచర్లను ఎస్-క్రాస్ కారులో అందించారు. (Photo: Suzuki)