* ఎలా రీకాల్ చేస్తారు? : ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ లోపం ఉన్న వాహన యజమానులను టయోటా డీలర్లు సంప్రదిస్తారు. వాహనాలను తనిఖీ చేస్తారు. సమస్య ఉందని తెలిస్తే వెంటనే కారుని రీకాల్ చేసి మరమ్మతులు చేస్తారు. కారు VIN నంబర్ని ఉపయోగించి కూడా తమ కారులో ఈ సమస్య ఉందని కస్టమర్లు స్వయంగా తెలుసుకోవచ్చు. దీని కోసం టయోటా వెబ్‌సైట్‌ను వాహన యజమానులు సందర్శించాల్సి ఉంటుంది.
వీఐఎన్ నంబర్‌ను వెబ్సైట్లో ఎంటర్ చేసి తమ కారు ఎఫెక్ట్ అయిందా లేదా అనేది తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ తమ కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ పాడైందన్న విషయాన్ని ఓనర్లు గుర్తిస్తే దాన్ని మార్చేలోగా కారు వినియోగాన్ని తగ్గించాలని టయోటా కోరింది. ఈ విషయాన్ని గ్లాంజా, హైరైడర్ కస్టమర్లు గుర్తించాలని కోరింది.
దీనిలో భాగంగానే టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV, గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేశాయి. సుజుకి వారి గ్లోబల్ సి ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పని చేసే అర్బన్ క్రూయిజర్ హైరైడర్ రెండు ఇంజన్లతో పని చేస్తుంది. మరోవైపు, గ్లాంజా మోడల్ టయోటా వారి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. మారుతి సుజుకి వారి బాలెనోను రీబ్యాడ్జ్ చేసి ఈ మోడల్‌ను తయారు చేశారు.