గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా పట్టాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఓవర్‌హెడ్ లైన్ నుంచి విద్యుత్ సేకరించే స్పెషల్ పాంటోగ్రాఫ్ను రైలుకు అమర్చినట్లు తెలిపారు. వీటితో పాటు కొన్ని మలుపులను సరి చేయనున్నారు. మార్చి 24న వందేభారత్ రైలు జైపూర్‌కి చేరుకోనుందని మంత్రి స్పష్టం చేశారు.
* టెక్నాలజీ ఎగుమతి : గత ఏడెనిమిది ఏళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వం రైల్వేలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు. మరో 3- 4 ఏళ్లలో వందేభారత్ టెక్నాలజీని దేశం ఎగుమతి చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వేలో ఎన్నో మార్పులు సంభవించాయని చెప్పారు.
అంతకుముందు కేంద్ర మంత్రి ఢిల్లీ- అజ్మీర్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారంతా సానుకూలంగా స్పందించడం సంతోషం వేసిందని మంత్రి చెప్పారు. రైలు వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోందని, చాలా పరిశుభ్రంగా ఉంటోందని తనతో చెప్పినట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ప్లాట్‌ఫాంలు కూడా చాలా శుభ్రంగా ఉన్నట్లు, రైల్వే సేవలతో సంతృప్తి పొందినట్లు కేంద్రమంత్రి స్ఫష్టం చేశారు.