ఫారం-16
ఫారం-16 అనేది ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన జీతం, తీసివేసిన, జమ చేసిన పన్నుల వివరాలను అందించడానికి సంబంధించిన సంస్థ జారీ చేసిన TDS సర్టిఫికేట్. సంస్థ పన్నులు మినహాయిస్తే ఉద్యోగికి ఫారం 16ను జారీ చేయడం తప్పనిసరి. జూన్ 15వ తేదీలోపు ఫారం 16 జారీ చేయాలి. ఫారమ్ 16లో పార్ట్ A, పార్ట్ B ఉంటాయి. ఉ రెండు భాగాలను తప్పనిసరిగా ఆదాయపన్ను శాఖ TRACES పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఫారం 16A, ఇతర TDS సర్టిఫికెట్లు
ఫారమ్ 16 కాకుండా, వ్యక్తులకు వర్తించే ఇతర TDS సర్టిఫికేట్లను కూడా తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.40,000, సీనియర్ సిటిజన్లకు అయితే రూ.50,000 మించి ఉంటే, బ్యాంకు ఆ మొత్తానికి పన్నును మినహాయిస్తుంది. పన్ను మినహాయింపు పొందినవారికి బ్యాంక్ ఫారమ్ 16A జారీ చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, కంపెనీలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన డివిడెండ్ రూ.5 వేలు మించి ఉంటే మినహాయించిన పన్ను కోసం ఫారమ్ 16Aని జారీ చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
నెలవారీ అద్దె రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ పొందేవారు, వారి అద్దెదారు నుంచి ఫారం 16C(TDS సర్టిఫికేట్) పొందాలి. ప్రస్తుత ఆదాయపన్ను చట్టాల ప్రకారం రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ నెలవారీ అద్దె చెల్లించే వారి వార్షిక అద్దె మొత్తం నుంచి పన్ను మినహాయించవలసి ఉంటుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భూమి, ఆస్తిని విక్రయించిన వారు మొత్తంపై మినహాయించిన పన్ను కోసం ఫారమ్ 16Bని అందించమని వారి కొనుగోలుదారుని అడగాలి. రూ.50లక్షల కంటే ఎక్కువ ఆస్తిని విక్రయిస్తే టీడీఎస్ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
వడ్డీ ఆదాయం, ఇతర వడ్డీ సర్టిఫికెట్లు
ITR ఫారమ్‌లలో సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు మొదలైన వివిధ వనరుల నుంచి పొందిన వడ్డీ ఆదాయాన్ని సూచించాలి. ఇది బ్యాంకులు, పోస్టాఫీసు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వడ్డీ సర్టిఫికేట్లను పొందాలి. వడ్డీ సర్టిఫికేట్ అందుబాటులో లేకుంటే, తప్పనిసరిగా బ్యాంక్ పాస్బుక్లని అప్డేట్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
సేవింగ్స్ అకౌంట్‌పై పొందిన వడ్డీకి వ్యక్తి సెక్షన్ 80TTA కింద రూ. 10,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఆర్బిఐ పన్ను పరిధిలోకి వచ్చే బాండ్లు మొదలైన వాటి నుంచి వచ్చే వడ్డీపై పూర్తిగా పన్ను చెల్లించాలి. కాబట్టి తప్పనిసరిగా ITRలో సరైన మొత్తాన్ని నివేదించాలి, తదనుగుణంగా పన్నులు చెల్లించాలి. PPF వడ్డీకి పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ దానిని పేర్కొనాలి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో గృహ రుణం/విద్యా రుణ EMI చెల్లించిన వ్యక్తులు పన్ను మినహాయింపు, తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి బ్యాంక్/ఆర్థిక సంస్థ నుంచి తిరిగి చెల్లింపు ధృవీకరణ పత్రాన్ని సేకరించాలి.(ప్రతీకాత్మక చిత్రం)
ఒక వ్యక్తి గృహ రుణ EMIపై చెల్లించే వడ్డీపై గరిష్టంగా రూ.2 లక్షల వరకు సెక్షన్ 24 కింద మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80C ఆర్థిక సంవత్సరంలో తిరిగి చెల్లించిన హోమ్ లోన్ యొక్క అసలు మొత్తంపై కూడా అందుబాటులో ఉంటుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విద్యా రుణంపై చెల్లించిన వడ్డీకి సెక్షన్ 80E కింద మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఫారం 26AS
వ్యక్తులు కొత్త ఆదాయ పన్ను పోర్టల్ నుంచి ఫారమ్ 26ASని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఫారమ్ 26AS అనేది పన్ను పాస్‌బుక్ లాంటిది, ఇందులో మినహాయించిన, ప్రభుత్వానికి జమ చేసిన పన్నుల వివరాలు ఉంటాయి. వ్యక్తులు TDS సర్టిఫికెట్లు, వడ్డీ సర్టిఫికెట్లలో అందుబాటులో ఉన్న సమాచారంతో ఫారమ్ 26ASలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రాస్-చెక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
పన్ను ఆదా పెట్టుబడి, ఖర్చు రుజువులు
ITR ఫైల్ చేస్తున్నప్పుడు మినహాయింపును క్లెయిమ్ చేయడానికి పన్ను-పొదుపు పెట్టుబడి, వ్యయ రుజువులను సేకరించడం ముఖ్యం. ITR ఫైల్ చేసే సమయంలో ఒక వ్యక్తి పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే, పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ఖర్చులను క్లెయిమ్ చేయవచ్చని గుర్తించాలి. ఏదైనా పన్ను ఆదా రుజువును ప్రకటించకుండా పోయినట్లయితే, ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో దానిని క్లెయిమ్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆస్తి, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మకాల మూలధన లాభాలు
ఐటిఆర్‌ను ఫైల్ చేసేటప్పుడు ఆస్తి, షేర్లు, మ్యూచువల్ ఫండ్ల విక్రయం ద్వారా వచ్చిన మూలధన లాభాలను తెలియజేయాలి. నోటిఫైడ్ ఫారమ్‌ల ప్రకారం, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వ్యక్తి ITR-1ని ఉపయోగించి పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయలేరు. అతను/ఆమె ITR-2/ITR-3ని ఉపయోగించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
బ్యాంక్ అకౌంట్ వివరాలు
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న బ్యాంక్ ఖాతా(ల) వివరాలను అందించడం తప్పనిసరి. ఖాతాను మూసివేసినప్పటికీ దానిని పేర్కొనాల్సి ఉంటుంది. బ్యాంక్ పేరు, అకౌంట్ నంబర్, రకం, IFS కోడ్‌ను పేర్కొనవలసి ఉంటుంది. ఆదాయపన్ను రీఫండ్ క్రెడిట్ పొందడానికి బ్యాంక్ అకౌంట్ అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)