వృషభం
వీరు చాలా నిజాయితీగా ఉంటారు. అబద్దాలు చెప్పేవారిని దరిచేరనివ్వరు. దీంతో డబ్బు విషయంలో వృషభ రాశివారిని సులభంగా విశ్వసించవచ్చు. నిజాయితీగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అందుకు కష్టపడి పనిచేయాలనే విషయాన్ని బలంగా నమ్ముతారు. ఎట్టిపరిస్థితుల్లో ఇతర మార్గాల్లో(చట్టవిరుద్దం) డబ్బు సంపాదించాలని అనుకోరు. డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవడానికి వృషభరాశి వారు అసలు ఇష్టపడరు. ఎలాంటి ఇబ్బందులు లేకుంటేనే డబ్బు విషయంలో అడుగు ముందుకు వేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
మీనరాశి
ఈ రాశివారి ప్రవర్తన బట్టి వీరు చాలా సున్నితంగా అనిపించవచ్చు. అయితే డబ్బు విషయానికి వస్తే...చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి డబ్బును ఎలా మేనేజ్ చేయాలో వీరి కంటే బాగా ఎవరికీ తెలియదు. ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి ఎలా సహాయం చేయాలో వీరికి బాగా తెలుసు. డబ్బు అవసరం ఉన్నవారికి ఎలాగైనా ఏదోరకంగా సాయం చేస్తారు. డబ్బు విషయంలో మీనరాశివారు ఎల్లప్పుడూ నమ్మదగిన వారిగా ఉంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం
డబ్బు విషయంలో ఈ రాశివారు భద్రంగా, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆర్థిక విషయాల్లో వృశ్చికరాశివారిని గుడ్డిగా నమ్మవచ్చు. ఎందుకంటే వీరు ఏరకంగా కూడా ఇతరులను మోసం చేయలేరు. వీరు నమ్మకంగా, నిజాయితీగా ఉంటారు. ఒకవేళ వృశ్చికరాశి వారిని ఎవరైనా మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వారిని నమ్మరు. వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ కూడా వేస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)