Zodiac Signs: ఈ రాశుల వారు హాలిడే వచ్చిదంటే చాలు.. ఆ పని చేయడంలో వీళ్లను మించిన వారు ఉండరు..
Zodiac Signs: ఈ రాశుల వారు హాలిడే వచ్చిదంటే చాలు.. ఆ పని చేయడంలో వీళ్లను మించిన వారు ఉండరు..
Zodiac Signs: జ్యోతిష శాస్త్రం ప్రకారం, మనలో కొన్ని రాశుల వారు మిగతా వారందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట. ఈ రాశుల వారు ఈ హాలిడే సీజన్లో ఎంతో సంతోషంగా బంధుమిత్రులతో మిక్కిలి ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
1/ 12
క్రిస్మస్ పండుగతో హాలిడే సీజన్ మొదలైపోయింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ పార్టీలు, గెట్ టుగెదర్ లాంటిదేదైనా ప్లాన్ చేయాలని భావిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను కొత్త ప్రదేశంలో జరుపుకోవాలని హాలిడే ట్రిప్‌లను కూడా ప్లాన్ చేసేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
ప్రస్తుతం ప్రపంచమంతా ఫుల్ వెకేషన్ మూడ్‌లో మునిగితేలుతోంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం, మనలో కొన్ని రాశుల వారు మిగతా వారందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
ఈ రాశుల వారు ఈ హాలిడే సీజన్లో ఎంతో సంతోషంగా బంధుమిత్రులతో మిక్కిలి ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులు వారెవరో.. అందులో మీరు కూడా ఉన్నారేమో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
వృషభరాశి వృషభరాశి వారు తమ పాత స్నేహితులను కలుసుకోవడానికి ఇది చాలా శుభ సమయం. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 12
అయితే ఈ సమయంలో వీరు తమ మాజీ భాగస్వాములను కలుసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మాజీ భాగస్వాములతో వాదోపవాదాలు పెరిగి వెకేషన్ మూడ్ పాడేయ్యే ఛాన్స్ ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
సింహరాశి క్రిస్మస్, నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు సింహరాశి వారు మెరిసిపోయే దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే తమ అద్భుతమైన వ్యక్తిత్వంతో అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు.
7/ 12
వీరు తమ అద్భుతమైన ప్రతిభాపాటవాలను అత్యుత్తమంగా ప్రదర్శిస్తారు. అలా ఈ హాలిడే సీజన్ లో అందరినీ మెప్పిస్తూ సింహ రాశి వారు తెగ ఎంజాయ్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 12
మకరరాశి ఈ హాలిడే సీజన్లో మకర రాశి వారికి ప్రేమకు కొదవ ఉండదు. వీరు సంతోషంగా ఉండటానికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు తమ బంధుమిత్రులకు మరింత దగ్గరవుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 12
ఈ రాశివారు ఆహ్లాదకరమైన హాలిడే సీజన్‌ను ఎంజాయ్ చేస్తారు. ఈ సమయంలో మకరరాశి వారిని ఎక్కువ మంది ప్రేమిస్తారు. అలాగే వీరిలో ప్రేమించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ హాలిడే సీజన్‌ను వీరిలా ఎవరూ కూడా ఎంజాయ్ చేయలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 12
మీనరాశి మీనరాశి వారు ఈ హాలిడే సీజన్‌ని కచ్చితంగా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ సీజన్ వీరిని ఉరుకుల పరుగుల ప్రపంచం నుంచి బయటపడేస్తుంది. ఎప్పుడూ బిజీగా ఉండే లైఫ్ నుంచి వీరు బ్రేక్ తీసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 12
అలా వీరికి ఈ హాలిడే సీజన్ లో మానసికంగా, శారీరకంగా చక్కటి విశ్రాంతి లభిస్తుంది. వీరు స్పా డేని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సెలవుల్లో అందరికీ దూరంగా ఉంటూ బిజీ ప్రపంచం నుంచి తప్పించుకుంటారు. ఈ సమయం అంతా సరదాగా గడుపుతూ మధురమైన జ్ఞాపకాలను ఏర్పరచుకుంటారు.
12/ 12
కర్కాటక రాశి ఈ సమయంలో కర్కాటక రాశి వారు సంప్రదాయాలు, ఆచారాలకు ఆకర్షితులవుతారు. ఆ విధంగా వీరు కుటుంబ సభ్యులు, స్నేహితులకు మరింత దగ్గరవుతారు. తద్వారా వీరు ఈ హాలిడే సీజన్‌ను అందరి కంటే బాగా ఎంజాయ్ చేస్తారు.