Zodiac signs: రాశి చక్రంలోని 12 రాశులను రెండుగా విభజించవచ్చు. యాక్టివ్, రిసెప్టివ్ (active and receptive). యాక్టివ్ రాశుల వారు ఆసక్తిగా, దేని గురించైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటారు. రిసెప్టివ్ రాశుల వారు సున్నితమైన వారు, వివేకవంతులు, బావోద్వేగాలు కలిగి ఉంటారు. మరి ఏ రాశి వారు ఎవరో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
మనలో ఉండే ఎనర్జీ, గుణాలు, బలాబలాలు, బలహీనతలు, మెచ్చుకోలుతనం... వంటివి అన్నీ మన కేరక్టర్‌ను డిసైడ్ చేస్తాయి. సాధారణంగా రాశులు 4 రకాలుగా ఉంటాయి. అవి భూమి, వాయు, అగ్ని, జల రాశులు. వీటి ఆధారంగా ఏ రాశి వారు ఎలాంటి వారో నిర్ణయిస్తారు జ్యోతిష పండితులు. ఇప్పుడు మనం తెలుసుకునేది మరోటైపు. (ప్రతీకాత్మక చిత్రం)
Active Zodiac Signs in Astrology: ధైర్యంగా, ఉద్రేకంతో ఉండే అగ్ని రాశులవారు.... బాగా మాట్లాడగలిగే వాయు రాశుల వారు యాక్టివ్ రాశుల లిస్టులోకి వస్తారు. అంటే.. మేష రాశి, సింహ రాశి, ధనస్సు రాశి, తుల రాశి, మిథున రాశి, కుంభరాశి. ఈ రాశుల వారిని పాజిటివ్ లేదా బలమైన రాశులుగా గుర్తిస్తారు. ఈ రాశుల వారు సమాజంతో బాగా కలుస్తారు. ఏదైనా పనిలోకి వేగంగా దిగుతారు. యాక్షన్ మొదలుపెడతారు. బాగా మాట్లాడుతారు. ధైర్యంగా ఉంటారు. ఉద్రేకం ఉంటుంది. ఏదీ దాచుకోరు... డైరెక్టుగా చెప్పగలరు, వేగంగా కదులుతారు. ఏదైనా బలంగా వాయిస్ వినిపిస్తారు. దూసుకుపోతారు. వీరు రిస్క్ తీసుకుంటారు. ఏది చెయ్యడానికైనా ముందుకొస్తారు. వెనకడుగు అనేది వీరిలో ఉండదు. డైనమిక్ లీడర్షిప్ లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Receptive Zodiac Signs: వివేకంతో ఉండే భూ రాశులవారు, భావోద్వేగాలతో సున్నిత మనస్తత్వంతో ఉండే జల రాశుల వారు... రిసెప్టివ్ రాశులు అవుతారు. అంటే కర్కాటక రాశి, మీన రాశి, వృశ్చిక రాశి, కన్య రాశి, వృషభ రాశి, మకర రాశి. వీరిని నకారాత్మక (negative) రాశుల వారిగా చెబుతారు. వీరు పైకి యాక్టివ్‌గా ఉండరుగానీ... లోలోపల చాలా ఫోకస్‌గా ఉంటారు. వీరు చాలా ప్రాక్టికల్, సున్నితమైన వారు, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు, వాస్తవాలకు దగ్గరగా ఉంటారు, లోతుగా ఆలోచిస్తారు, కష్టించి పనిచేస్తారు. వీళ్లు దేనికైనా చెలరేగిపోకుండా... సున్నితంగా డీల్ చేస్తారు. పద్ధతిగా డీల్ చేస్తారు. వీళ్లు ఇతరులను అర్థం చేసుకొని, మరీ బావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుంటారు. వీళ్లు ప్రతీదీ అంతర్గతంగా చూస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా... ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడతారు. వీరు ఇతరులకు వెంటనే అర్థం కారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇలా 12 రాశులను రెండు రకాలుగా జ్యోతిష పండితులు విభజించినా... మొత్తంగా అన్ని రాశుల వారూ మంచివారే అని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో రకంగా పరిస్థితులను డీల్ చేస్తూ... మొత్తంగా మంచి జరిగేలా చేస్తారని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)