మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) మిధున రాశి వారు చాలా చెలాకీగా, చురుకుగా ఉంటారు. ఎప్పుడూ బయటి ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు. ఎంతో మందితో పరిచయాలుంటాయి. పార్టీలు, వేడుకలు, ఫంక్షన్లు, షాపింగ్ ఇలా ఎన్నో కార్యక్రమాల్లో వీరు పాల్గొంటూ ఉంటారు. సమస్యేంటంటే... వీరు ఎవరి గురించీ ఆలోచించరు. ఎవరితో ఉంటే వారికి ఆనందం కలిగిస్తూ హాయిగా జీవిస్తారు. ఐతే... వీరి నుంచి దూరం అయిన వారు ఎప్పుడైనా రివర్స్ ఏదైనా మాట అన్నారంటే చాలు... మిధున రాశి వారు అగ్నిపర్వతం అయిపోతారు. అది చిన్న విషయం అయినా చాలు... అస్సలు సహించరు. అప్పటికప్పుడు రివెంజ్ తీర్చుకునేంత దాకా వెళ్లిపోతారు. యాంగర్ మేనేజ్మెంట్లో వీరికి అస్సలు కంట్రోల్ ఉండదు. అందువల్ల మిధునరాశి వారిని రెచ్చగొట్టకుండా... కలిసి ఓసారి మాట్లాడితే చాలు... అపార్థాలన్నీ తొలగి... సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి.