ZODIAC SIGNS THESE ZODIAC SIGNS ARE LEAST LIKELY TO MARRY SJN
Zodiac Signs : పెళ్లంటే చాలు.. ఈ రాశుల వారు ఆమడ దూరం పరుగెడతారు.. కారణం ఏంటంటే?
Zodiac Signs : అయితే కొన్ని రాశుల వారు మాత్రం పెళ్లంటేనే చిరాకు పడుతుంటారు. అప్పుడే పెళ్లేంటి అంటూ ఎదురు సమాధానం ఇస్తూ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రాశుల వారు ఎవరో ఒకసారి చూద్దాం.
పెళ్లనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఒక వయసు వచ్చాక పెళ్లి కాకపోతే గుళ్లు గోపురాలు అంటూ తిరగడం భారతదేశంలో మనం చూస్తూనే ఉంటాం. దోషం పోవాలంటూ అభిషేకాలు కూడా చేయిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం).
2/ 7
అయితే కొన్ని రాశుల వారు మాత్రం పెళ్లంటేనే చిరాకు పడుతుంటారు. అప్పుడే పెళ్లేంటి అంటూ ఎదురు సమాధానం ఇస్తూ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రాశుల వారు ఎవరో ఒకసారి చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం).
3/ 7
మిధున రాశి వారు చంచలమైన బుద్ధితో ఉంటారు. ఒక విషయంపై ఎప్పుడూ వీరు స్థిరంగా ఉండరు. వేసుకునే చొక్కాలను మార్చినట్లు వీరు తమ నిర్ణయాలను మార్చుకుంటారు. ఇక ఒక వ్యక్తితో జీవితాంతం ఉండాలనుకోరు. ఈ లక్షణాలతో వీరికి పెళ్లంటే అయిష్టత ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం).
4/ 7
సింహరాశి వారికి పెళ్లిపై మంచి అభిప్రాయంతోనే ఉంటారు. అయితే వీరు థ్రిల్ ను కోరుకునే స్వభావం కలవారు. బోరింగ్ గా ఉండే పనులను చేయడం అంటే వీరికి నచ్చదు. వీరి దాంపత్య జీవితంలో గొడవలు వంటివి వస్తే ఆ బంధం నుంచి బయటపడేందుకు వెంటనే రెడీ అయిపోతారు. (ప్రతీకాత్మక చిత్రం).
5/ 7
కుంభరాశి వారికి పెళ్ళంటే బాధ్యతలు.. స్వేచ్ఛను హరించివేసే ఒక బంధం అనే ధోరణిలో ఉంటారు. అందుకే వీరి ముందు పెళ్లి ప్రస్తావనను తీసుకువస్తే కోప్పడతారు. పెళ్లిని తమ కాళ్లకు కళ్లెం వేసే వస్తువుగా వీరు భావిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం).
6/ 7
పెళ్లి తర్వాత వచ్చే బరువు బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచించే రకం మీన రాశి వారు. వీరు లేనిపోనివి ఊహించుకుంటూ పెళ్లిపై ఒక చెడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వీరికి సమస్య ఎదురైతే దానిని ఎదర్కోకుండా పారిపోయే గుణం ఉంటుంది. ఇదే వీరికి పెళ్లంటే ఒక రకం భయాన్ని కలిగేలా చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం).
7/ 7
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం).