Zodiac Signs: స్నేహమే జీవితం... స్నేహమే శాశ్వతం అంటారు... కాని ఇప్పుడు మనం చెప్పుకునే రాశులవారికి స్నేహం చెయ్యడం చాలా కష్టమైన విషయం. వారు కొత్త స్నేహితుల్ని పొందడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వారు ఎవర్నీ అంత త్వరగా నమ్మరు. ఓపెన్‌గా, ఫ్రీగా ఉండరు, ఎవరితోనూ మనస్ఫూర్తిగా వ్యవహరించలేరు. అందువల్ల వీరితో స్నేహం చెయ్యాలంటే... అవతలి వారికి ఒకింత ఇబ్బందిగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
నిజానికి స్నేహితులు ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. వారితో మన కష్టాలు చెప్పుకోవచ్చు. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు తోడుగా ఉంటారు. ఎన్నో సందర్భాల్లో వారు అండగా నిలుస్తారు. నిజమైన స్నేహితులు ప్రాణానికి ప్రాణంగా నిలుస్తారు. అలాంటి స్నేహితుల్ని పొందడం మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా కారణంగా... స్నేహితులు ఎక్కడున్నా... టచ్‌లో ఉంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ రాశుల వారు ఎందుకు స్నేహం చెయ్యలేరో, ఆ 4 రాశులూ ఏవో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
మిథున రాశి (Gemini) మిథున రాశి వారు సొసైటీలో బాగా కలిసిపోతారు. వీరికి విపరీతంగా స్నేహాలు, పరిచయాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్లినా వీరి సర్కిలా చాలా పెద్దగా ఉంటుంది. ఇది వీరికి ప్లస్ పాయింట్. ఇదే వీరికి నెగెటివ్ పాయింట్ కూడా. ఇంతమందితో సరదాగా ఉండే వీరికి... నిజమైన క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ ఉండరు. ఎండ్ ఆఫ్ ది డే వీరు ఒంటరి అవుతారు. ఎవరూ కరెక్టు కాదు అనే అభిప్రాయం వచ్చేస్తుంది. ఎంతో మందితో సరదాగా ఉండే వీరికి... కొద్ది మందితో ఫుల్ ర్యాపో మెయింటేన్ చెయ్యడం కష్టమవుతుంది. అందువల్ల ఎవరూ వీరితో పూర్తిగా ఉండరు. అందువల్ల వీరు ఎవర్నీ పూర్తిగా నమ్మరు. అటు స్నేహితులు కూడా వీరిని నమ్మాలని అనుకోరు.
కర్కాటక రాశి (Cancer) కర్కాటక రాశి వారు కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు. వారికి ఏ కాస్త టైమ్ దొరికినా... దాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తారు. ఇంటి దగ్గర ఉండటమే వారికి ఇష్టం. కుటుంబ సభ్యులతోనే రిలాక్స్ అవుతారు. ఐతే... కర్కాటక రాశి వారు సమాజంతో బాగానే కనెక్ట్ అవుతారు. వీరికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తెలుస్తారు. పెద్ద ఎత్తున పరిచయాలూ ఉంటాయి. కానీ... వీరు కూడా ఎవరితోనూ బాండ్ పెట్టుకోరు. కొద్ది మంది స్నేహితులను ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకోవాలి అనుకోరు. ప్రధానంగా వీరు ఎవర్నీ నమ్మరు. అందువల్ల స్నేహాలు వీరికి సెట్ కావు.
కుంభ రాశి (Aquarius) కుంభరాశి వారు ఇంట్రావెర్ట్ (లోలోపల ఆలోచించుకునే నైజం), మొహమాటం ఎక్కువ. వీరు ఇతరుల ముందు ఓపెన్ అవ్వరు. పైకి స్నేహం చేస్తున్నట్లు ఉన్నా... లోపల ఏదో భయం వీరిలో ఉంటుంది. అందువల్ల వీరు ఎవర్నీ అస్సలు నమ్మరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో... తమపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతారని వీరు బలంగా నమ్ముతారు. అందువల్ల వీరు తమ జీవితంలో ఎవరు కలిసినా... వారితో స్నేహంగా ఉన్నట్లు ఉంటారే తప్ప... లోతైన స్నేహం ఉండదు. కొత్త స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలని వీరు అస్సలు అనుకోరు.
మీన రాశి (Pisces) మీన రాశి వారి అతిగా ఆలోచించుకుంటారు. పైగా వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువ. మిగతా అన్ని రాశుల వారి కంటే ఎక్కువ. చాలా సందర్భాల్లో మరీ ఎక్కువ లోతుగా ఆలోచించి... పరిస్థితులను అయోమయం చేసుకుంటారు. ఆలోచనల ప్రవాహం ఎక్కువ అవ్వడంతో... వీరు ఇతరులతో ఈజీగా ఓపెన్ అవ్వరు. లోలోపల తేడా కొడుతున్నట్లు ఆలోచించుకుంటూ ఉంటారు. వీరితో స్నేహం చేద్దామని ప్రయత్నించే వారికి... వీరి లోతైన ఆలోచనా ధోరణిని అర్థం చేసుకోలేక... దూరం అవుతారు. అందువల్ల మీన రాశి వారు కూడా అందరితోనూ కలుస్తూనే... బలమైన స్నేహం మాత్రం కలిగి ఉండలేరు.