Zodiac signs: అదృష్టం కొద్దీ కొందరు చాలా సరళంగా, సింపుల్‌గా, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. వీరు ఏదీ భారమయ్యే పరిస్థితి తెచ్చుకోరు. దేన్నీ అతిగా ఆలోచించరు. ఒక్కోసారి అతిగా ఆలోచిస్తే... ఉన్న సమస్య తీరకపోగా... మరింత జఠిలమవుతుంది. అలా జరిగితే... మరిన్ని సమస్యలు పెరుగుతాయి. కన్ఫ్యూజన్ పెరుగుతుంది. కోపతాపాలు ఎక్కువవుతాయి. అలా ఉండకూడదు. సరళంగా, సింపుల్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పుడు మనం చెప్పుకునే రాశుల వారు ఏదైనా సరే ఈజీగా కానిచ్చేస్తారు. హడావుడి ఉండదు. పెద్దగా ఆశలు, ఆశయాల్లాంటివి పెట్టుకోరు. జీవితం ఎలా సాగితే... అలా కానిచ్చేస్తూ ఉంటారు. వీళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తమను తాము ప్రేమించుకుంటారు. ప్రశాంతంగా, భవిష్యత్తుపై పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. అలాంటి రాశులు 4 ఉన్నాయి. అవేంటో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశి (Cancer) కర్కాటక రాశికి వర్రీ అవ్వడం అస్సలు నచ్చదు. వర్రీ అయితే... సమస్య పరిష్కారం కాదనీ... అద్భుతాలు జరగవు అని వారికి బలమైన నమ్మకం. అందువల్ల వాళ్లు ఒత్తిడి లేకుండా ఉంటారు. ప్రశాంతంగా, స్థిరమైన మనసుతో ఉంటారు. వీళ్లు కంట్రోల్ తప్పరు. కూల్‌గానే ఉంటారు. వీళ్లను నమ్మవచ్చు. వీళ్లు చాలా సింపుల్ లైఫ్ స్టైల్ కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలతో ఉంటారు.
సింహ రాశి (Leo) సింహ రాశి వారిలో నిజాయితీ, ముక్కుసూటి తనం ఎక్కువ. ఏదైనా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పగలరు. మనసులో ఏముందే అదే చెబుతారు. అలా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోరు. అందువల్లే వీరి విషయంలో కన్ఫ్యూజన్ ఉండదు. క్లారిటీ ఉంటుంది. తమ చుట్టూ ఉండేవారితో వీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు, వ్యవహరిస్తారు. ఇతరులు కూడా అలాగే ఓపెన్‌గా ఉండేలా చేస్తారు. వీళ్లు ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయిపోతారు. స్ట్రైయిట్‌గా ఉంటారు, వాస్తవ దృష్టితో ఉంటారు.
కన్య రాశి (Virgo) కన్య రాశి వారికి కొన్ని సమస్యలు ఉన్నా వీరు సంపూర్ణరాశిగా గుర్తింపు పొందారు. వీళ్లు ఏది జరిగినా పద్ధతిగా సరిగ్గా జరగాలని కోరుకుంటారు. వీళ్లు తమ తప్పుల్ని ఓపెన్ గానే ఒప్పుకుంటారు, అలాగే ఇతరుల తప్పుల్ని కూడా ఎత్తిచూపుతారు. ఈ విషయంలో రాజీ పడితే... మున్ముందు ఇంకా ఇలాంటి ఎన్నో రాజీలు పడాల్సి వస్తుందని వీరు భావిస్తారు కాబట్టే... ఎప్పటికప్పుడు విషయాల్ని సెటిల్ చేసేస్తారు. అందువల్ల వీరు గందరగోళంలో జీవించరు, ఒత్తిడిని పెంచుకోరు, రిలాక్స్ జీవితాన్ని పొందుతారు.
మకర రాశి (Capricorn) మకర రాశి వారికి తమ గురించి తమకు బాగా తెలుసు. తమకు ఏం కావాలో, ఎప్పుడు కావాలో తెలుసు. ఇలా క్లారిటీగా ఉంటారు కాబట్టే... వీరికి కన్ఫ్యూజన్, అయోమయ సమస్యలు ఉండవు. గందరగోళం రానివ్వరు. వీళ్లు నిజాయితీగా ఉంటారు. వాస్తవంగా జీవిస్తారు. ఏదైనా డైరెక్టుగా చెబుతారు. తమ నిర్ణయాలపై స్థిరంగా ఉంటారు. చుట్టూ ఉన్న అందరితోనూ ఇదేరకంగా ప్రవర్తిస్తారు కాబట్టే... వీరికి ఎవరితోనూ ఏ చిక్కులూ ఉండవు. కాబట్టి... ప్రశాంతమైన జీవితం లభిస్తుంది.