వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృషభ రాశివారికి ఏదైనా నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే చాలా వేగంగా నేర్చేసుకుంటారు. దానికి తోడు వీళ్లకు ఏకాగ్రత, మనో నిశ్చయం ఎక్కువ. దేనిపైనైనా దృష్టి పెడితే... ఇక దానిపైనే ఫోకస్ ఉంచుతారు. ఇతరత్రా ఏవీ పట్టించుకోరు. అందువల్ల చేసిన పనిలో తిరుగులేని ట్రాక్ రికార్డ్ వీళ్ల సొంతమవుతుంది. అందువల్ల ఆటోమేటిక్గా పనికి గుర్తింపు, డబ్బు, సమాజంలో ఉన్నత స్థితి వంటివి వీరికి లభిస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)