ఎవరితోనైనా రిలేషన్ మొదట్లో బాగా ఉంటుంది. డేటింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. వారి మధ్య కనెక్షన్, కెమిస్ట్రీ చెక్కుచెదరకుండా ఉంటుంది. అయితే ఆ తరువాత కొంత కాలానికి వివిధ కారణాలతో ప్రియురాలు చేసే మెసెజ్‌లకు రిప్లై ఇవ్వడం మానేసి మీ ప్రయారిటీలను పూర్తిగా మార్చుకుంటే?ఇలాంటి సందర్భాల్లో రిలేషన్ షిప్ కొనసాగించడం చాలా కష్టం. (ప్రతీకాత్మక చిత్రం)
ఒక రిలేషన్ ఎక్కువ కాలం కొనసాగాలంటే కృషి, అంకితభావం అవసరం. అయితే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండకూడదనుకునే సందర్భాలు ఉన్నాయి. అందుకు రిలేషన్లో ఉన్న వ్యక్తే కారణం కావచ్చు. అతని ప్రవర్తన ఫలితంగా రిలేషన్‌కు గుడ్ బై కూడా చెప్పవచ్చు. ఇక్కడ రిలేషన్‌ను ముగించాలని అనుకుంటున్న నాలుగు రాశులు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం.
మేషం
ఈ రాశివారికి సహజంగా పోటీ మనస్తత్వం ఉంటుంది. దీంతో గెలుపు అనే భావనను బాగా ఆనందిస్తారు. అయితే ఈ పోటీతత్వాన్ని వారి రిలేషన్లోకి తీసుకొస్తుంటారు. దీంతో సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే కొన్ని విషయాలపై హఠాత్తుగా, అసహనం ప్రదర్శిస్తుంటారు. ఈ కారణంగా వారు తమ జీవితంలోని సంబంధాలను తరచుగా వదలుకోవాల్సి వస్తుంది. వారి అనాలోచిత నిర్ణయం ఫలితంగా విడిపోయిన వెంటనే పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం
ఈ రాశివారికి ప్రైవసీ అత్యవసరం. రిలేషన్షిప్ దెబ్బతినే విషయాలను అరికట్టడానికి వారు ఎలాంటి ప్రయత్నాలు చేయరు. అసలు ఏం సంబంధం లేనట్టుగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే తమ చేష్టలతో మోసకారిగా, చెత్త పనులు చేస్తూ స్వయంగా రిలేషన్‌ను నాశనం చేసుకుంటారు. సామాజిక రాశులల్లో మీనం ఒకటి. అయితే వారు ఇతరుల అవసరాల కంటే వారి సొంత అవసరాలు, భావోద్వేగ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ఇష్టపడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
మిధునం
మెర్క్యురీ పాలక గ్రహం గనుక రిలేషన్ విషయాల్లో మిధున రాశివారిని కష్టపడేలా చేస్తుంది. వినడం కంటే ఎక్కువగా మాట్లాడటం కారణంగా సంబంధాన్ని విషపూరితం చేసుకుంటారు. తమ భాగస్వామి ఏం చెప్పాలనుకుంటుందన్న విషయాన్ని అసలు పట్టించుకోరు. ఈ తంతు తరచుగా జరుగుతుంటుంది. మిధున రాశివారు ఒంటరి తోడేళ్ల లాంటివారు. సాహసం సహజంగా వారిలో ఉంటుంది. ఈ లక్షణం కారణంగా సంబంధాలను నెరపడం వారికి కష్టం.
ధనస్సు.. ఈ రాశి వారు తమ సొంత మార్గంలో పయణించాలనుకుంటారు. దీంతో వారిని ఎప్పటికీ సొంతం చేసుకోలేం. వారిని నియంత్రించడానికి మీరు ఎంత ప్రయత్నించినా... ప్రతిగా మిమ్మల్ని నియంత్రించడానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే ధనస్సు రాశివారు యజమానిగా ఫీలవుతుంటారు. అలాగే సంబంధాల నుండి తప్పించుకోవడానికి వారు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అది స్వల్పకాలిక లేదా సాధారణ సంబంధమా అనేది వారి ప్రాధాన్యతను బట్టి ఉంటుంది.
ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా తమ సంబంధాలను నాశనం చేసే చాలా మంది వ్యక్తులు ప్రవర్తిస్తుంటారు. ఆ బంధానికి గుడ్ బై చెప్పడానికి ముఖ్యకారణం వారితో కలిసి ఉండడం ఇష్టం లేక అలాంటి పనులు చేస్తుంటారు. వాటిని వారు చేసే పనుల్లో చూడవచ్చు. మీరు ఎవరితో గడపాలనుకుంటున్నారో, అందుకు ఎవరినీ ఎంచుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ముందుగా మీ హృదయాన్ని వినండి. (ప్రతీకాత్మక చిత్రం)