కన్యారాశి వారి గురువు బుధుడు. బుధుడు మానసిక ధైర్యానికి పెట్టింది పేరు. ఎటువంటి ప్రతికూల పరిస్థితిలోనైనా సరే వీరు సహనం కోల్పోకుండా ఆలోచించగలరు. అదే వీరి అతి పెద్ద బలం. కుటుంబానికి వీరే వెన్నుముక. ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమిస్తారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇతరులకు ఉపకారం చేయడంలో కుంభరాశి వారు ఎప్పుడూ ముందుంటారు. అన్యాయాలపై ఎప్పుడూ దూకుడుగా ఉండే నైజం వీరిది. వీరు కుంటుంబం కంటే కూడా సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలా అని కుటుంబాన్ని పట్టించుకోరని కాదు. కుటుంబ సభ్యలకు ఎటువంటి ఆపద వచ్చినా సరే దానిని ఎదుర్కొనేందుకు ముందు వరుసలో నిలబడతారు. తమ నేర్పులో సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)