Zodiac signs: సముద్రం దగ్గర చైర్ వేసుకొని కూర్చుంటే... అలల సవ్వళ్లు... చల్లటి గాలి తగులుతూ ఉంటే... ఎంత ఎండ ఉన్నా... మనసుకు ప్రశాంతంగానే ఉంటుంది. కొన్ని రాశుల వాళ్లు ఇలా ప్రకృతిలో తిరగాలనీ... బాగా ఎంజాయ్ చెయ్యాలని భావిస్తారు. మరికొందరికి బీచ్‌లు నచ్చవు. పర్వతాల చెంతకు వెళ్లాలని వాళ్లు కలలు కంటారు. సాహసాలు చేస్తారు. వీరు రెగ్యులర్ జీవితాన్ని అనుభవిస్తున్నా... తరచూ ఆ పర్వతాల కలలే కంటూ ఉంటారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా హిల్ స్టేషన్లలోని ప్రకృతిలోకి వెళ్లి విహరిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభ రాశి (Taurus) వృషభ రాశి వారికి లగ్జరీ వస్తువులు నచ్చుతాయి. ప్రతీదీ ఫ్యాన్సీగా చూసేందుకు చాలా స్టైలిష్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకే వీళ్లు అత్యంత ఎత్తుగా ఉండే పర్వతాలు, వాటి పరిసరాలను బాగా ఇష్టపడతారు. వీరికి సాహసాలు చేయడం చాలా ఇష్టం. ఎవరూ చేయనివి చేస్తూ... ప్రకృతిలో విహరించాలి అనుకుంటారు. పర్వతాల దగ్గర ఎవరూ వెళ్లని ప్రాంతాలకు వెళ్లాలని కోరుకుంటారు. హిల్ స్టేషన్‌కి వెళ్లినప్పుడు వీరు మొబైల్స్ వాడరు. ఏ పనీ చెయ్యరు. పూర్తి ప్రశాంతత కోరుకుంటారు.
కన్య రాశి (Virgo) పర్వతాల హిమ సోయగాలు, ఆ గ్రీనరీ వంటివి కన్య రాశి వారికి బాగా నచ్చుతాయి. అక్కడ చిత్ర విచిత్రమైనవి కనుక్కోవాలని ఈ రాశి వారు ఎంతో ఆసక్తితో ఉంటారు. పర్వతాలు, కొండల వంటివి కనిపిస్తే... వీరు అస్సలు ఆగరు. వాటి పై దాకా ఎక్కి... అక్కడి నుంచి ఈ ప్రపంచాన్ని స్కై స్కేప్‌లో చూడాలని భావిస్తారు. పర్వతాల చుట్టూ ఉన్న బ్యూటీ మొత్తాన్నీ చూసేసి... ఆ దృశ్యాల్ని మనసులో బంధించేసుకోవాలి వీరు తపిస్తారు.
వృశ్చిక రాశి (Scorpio) పుర్వతాలు సాహసాలతో కూడినవి. వాటిలో మిస్టరీ ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకే వృశ్చిక రాశి వారికి అవి బాగా నచ్చుతాయి. వీరు పర్వత సానువుల చెంతకు వెళ్లి... అక్కడ ప్రశాంతంగా కూర్చొని... ఆ గాలి సవ్వళ్లు, పూల కదలికలను గమనిస్తూ ఉంటారు. పక్షుల కిలకిలలు వింటూ... పరవశిస్తారు. హిల్ స్టేషన్లో కోజీ క్యాబిన్లో కూర్చొని... చలి మంట కాచుకుంటూ... ఆ ప్రశాంతతను ఎంజాయ్ చేస్తారు.
మకర రాశి (Capricorn) మకర రాశి వారికి పర్వతాల చల్లటి వాతావరణం, అక్కడి నుంచి వచ్చే శీతల గాలులు అంటే చాలా ఇష్టం. కన్య రాశి వారి లాగే వీరు కూడా.. ఏదో కనుక్కోవాలని కోరుకుంటారు. పర్వతం దగ్గర ఏదైనా సాహసం లేకపోతే వీరికి థ్రిల్ ఉండదు. వీరికి బీచ్‌లో ప్రశాంతంగా కూర్చొని ఉండటం కంటే... పర్వతాలు ఎక్కి... లేదా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ... వాటిని ఎక్స్ప్లోర్ చెయ్యడం బాగా ఇష్టం. అందువల్ల వీరు ఎప్పుడూ వీరి మనసు పర్వతాలు, ఆ ప్రదేశాల్లోనే విహరిస్తూ ఉంటుంది.