Zodiac Signs: కొంత మంది చూడండి చాలా మొండిగా ఉంటారు, ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు... కొంత మంది మాత్రం విధేయులుగా, లొంగిపోయే వారిలా ఉండేందుకే ఇష్టపడతారు. నిజానికి ఇలా సరెండర్ అయిపోవడం అనేది తప్పేమీ కాదు. తద్వారా అవతలి వారికి ఎంతో గౌరవం, మర్యాద ఇస్తున్నట్లు లెక్క. వారు చెప్పింది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పే విధానం ఇది. ఇలాంటి వారు ఏ విషయంలోనూ ముందడుగు వెయ్యరు. ఇంకెవరైనా రెస్పాన్సిబులిటీ తీసుకుంటే సంతోషిస్తారు. వీరు ఆ రెస్పాన్సిబులిటీ తీసుకునేందుకు ఆసక్తి చూపరు. వీరికి ఆధిపత్యం చెలాయించడం ఇష్టం ఉండదు... సైలెంటైపోవడమే నచ్చుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అవతలి వారు చెప్పేది బాగా వింటూ... వంద శాతం ఫాలో అవుతారు వీరు. అలా చేయడం వల్ల వీరికి అభద్రతా భావం ఉండదు. తమకు అండగా మరొకరు ఉన్నారనే ఫీలింగ్ వీరికి ఉంటుంది. అవతలి వాళ్లు వీరిపై ఆధిపత్యం చెలాయిస్తున్నా... నో ప్రాబ్లం అనుకుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం అలాంటివి 4 రాశులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభ రాశి (Taurus) వృషభ రాశి వారు సైలెంట్ టైపు. ఇతరులెవరైనా తమ కోసం పని చేస్తూ ఉంటే... ఇష్టపడతారు. లేనిపోని ఒత్తిళ్లు, టెన్షన్లు వీరు నెత్తిన వేసుకోరు. బాధ్యతలు వేరే వారు నిర్వహిస్తే వీరికి ఇష్టం. వీరు నిర్ణయాలు తీసుకోరు. వేరే వాళ్లు బాధ్యత దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటే వీరు ఆనందంగా ఆమోదిస్తారు. ఇతరులు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాశి వారు... వారికి అన్నీ చెబుతారు. ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో చెబుతారు. అన్నీ తెలిసి కూడా వీరు మాత్రం ఆ బాధ్యతను మోసేందుకు ముందుకు రారు. అలాగే బాధ్యతను మోసేవారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు.
మిథున రాశి (Gemini) మిథున రాశి వారు ఆహ్లాదకరంగా ఉంటారు. వీరు దేనికీ ఫిక్స్ అవ్వరు. కండీషన్లు నచ్చవు. ఫ్రీడం కోరుకుంటారు. ఏ బాధ్యతలు తీసుకోవాలన్నా వీరికి అస్సలు నచ్చదు. తమను బంధీ చేస్తున్నట్లు ఫీలవుతారు. అందువల్ల వీరికి సంబంధించి ఇతరులు ఏ నిర్ణయం తీసుకున్నా... ఏమాత్రం ఫీల్ అవ్వరు. ఆ బాధ్యతలు మోసే కంటే... ఇతరులు చెప్పినట్లు ఫాలో అయిపోవడం బెటరనే ఫీలింగ్ వీరికి ఉంటుంది. ఇతరులు కూడా వీరికి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యతలు ఇవ్వకూడదు. ఇచ్చారంటే... వీరు చాలా టెన్షన్ పడతారు. మానసికంగా కుంగిపోతారు. అలాంటి విపరీత పరిస్థితి రాకుండా చూసుకోవడమే మేలు.
కర్కాటక రాశి (Cancer) కర్కాటక రాశి వారికి భావోధ్వేగాలు ఎక్కువ. వీరు హెవీ సెంటిమెంట్‌తో ఉంటారు. మంచివారు, పరిశీలనాత్మక దృష్టి ఎక్కువ. అందువల్ల వీరు బాధ్యతలు తీసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపరు. ఇంకెవరైనా తీసుకుంటే... వారికి వంద శాతం సహకరిస్తారు. ఇతరులు తమపై ఆధిపత్యం చెలాయించినా వీరు ఏమాత్రం ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. పైగా... వారి ఆర్డర్లన్నీ పక్కగా ఫాలో అవుతారు. ఏం చెప్పినా వింటారు. బాధ్యతలు తీసుకుంటే... లేనిపోని ఫీలింగ్స్‌తో ఇబ్బంది పడే కంటే... అవతలి వారికి పూర్తి సహకారం ఇస్తూ... వారికి కుడి భుజంలా ఉండటం ఈ రాశి వారికి ఇష్టం.
తుల రాశి (Libra) తుల రాశి వారంటే చాలా మందికి బాగా నచ్చుతారు. అలా నచ్చేలా వీరు ఉంటారు. ఎందుకంటే... వీరు దయ, విధేయత, గౌరవం, అంకితభావం అన్నీ ఇతరుల పట్ల చూపిస్తారు. ఇతరులు ఏం చెప్పినా... అది మంచైనా, చెడైనా... బాహుబలి సినిమాలో కట్టప్పలా ఫాలో అవుతారు. వీరి దృష్టంతా... సరిగ్గా ఫాలో అవుతున్నానా లేదా అన్నదానిపైనే ఉంటుంది. అలా జరగకపోతే... లేనిపోని వివాదాలు, సమస్యలూ వస్తాయని వీరు భావిస్తారు. ఇతరులు బాధ్యత తీసుకుంటే... వారి కింద పనిచెయ్యడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని వీరు నిర్మొహమాటంగా చెప్పగలరు.