కుంభం
ఈ రాశివారికి ఇది చాలా కష్టసమయం. మీరు కుంభరాశి అయితే, మీరు చేయవలసినది కేవలం వదులుకోకపోవడమే. మీరు చాలా కాలంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి విషయంలోనూ అడ్డంకులు ఎదుర్కోవాల్సిన సమయం ఇది. మీరు వ్యక్తిగత, వృత్తి జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కష్టకాలం మీ నుండి చాలా బలం, ఉత్సాహం, దృష్టిని కోరుతుంది. మీరు వాటన్నింటిని ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సురక్షితమైన జీవితం కోసం ప్రశాంతంగా, సానుకూల దృక్పథంతో ఉండండి. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం
మేషరాశివారు అదనపు జాగ్రత్త తీసుకోవడం అవసరం. మే16న అంటే చంద్రగ్రహణం రోజున వీరు ఆరోగ్య సంబంధిత సమస్యలు, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిరావచ్చు. నక్షత్రాల ఆధారంగా నిర్ణయాలను నిదానంగా తీసుకోవాలి. అనవసరమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈ దశ త్వరలో ముగుస్తుంది. దీంతో వీరు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల
ఈ రాశివారు అదనపు ఖర్చులను నివారించుకోవాలి. చంద్రగ్రహణం వీరి ఆర్థిక విషయాలపై చాలా ప్రభావం చూపుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. భాగస్వామితో వైరుధ్యంలో కూడా ఉన్నట్లు ఈ రాశివారు గుర్తించే అవకాశం ఉంది. దీంతో మీ సంబంధం బలోపేతం కోసం మరింత శ్రద్ధ అవసరం. ఈ రోజు ఎటువంటి అదనపు ఖర్చులను నివారించాలనుకోవచ్చు. ఈ దశ గడిచే వరకు మీ భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఉంటే మంచిది.
మరోవైపు చంద్రగ్రహణంపై నాసా కీలక ప్రకటన చేసింది. సూపర్మూన్, బ్లడ్ మూన్ లేదా ఫ్లవర్ మూన్ అని కూడా పిలిచే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం, మే 15 రాత్రి నుంచి మే 16 ప్రారంభ గంటల వరకు ఉంటుందని తెలిపింది. బ్లడ్ మూన్ గ్రహణాన్ని వెబ్కాస్ట్లలో చూడొచ్చని పేర్కొంది. TimeandDate.com ప్రకారం, చంద్రుని పాక్షిక గ్రహణం దశ మే 15 రాత్రి 10:28 గంటలకు ప్రారంభమవుతుంది.
బ్లడ్ మూన్ పీక్ మే 16న మధ్యాహ్నం 12:11 గంటలకు EDT (0411 GMT)కి ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఈ ఖగోళ ఘట్టం 1:55 a.m. EDT (0555 GMT)కి ముగుస్తుంది. భారతదేశంలో గ్రహణం కనిపించనప్పటికీ, దక్షిణ అమెరికా, యూరప్ మరియు మధ్య-ప్రాచ్య దేశాలలోని కొన్ని ప్రాంతాలు వారాంతంలో చంద్రుడు రక్తం ఎరుపు రంగులోకి మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)