తులారాశి
తులారాశివారు బాగా సమతుల్యత ఉన్న వ్యక్తులు. చాలా తెలివైన వారు కూడా. ఈ రాశికి చెందిన వారు సమస్యలను పరిష్కరించడంలో గొప్పవారు. వీరు సాధారణంగా ఒత్తిడి, ఆందోళనకు కారణమయ్యే విషయాలకు చాలా దూరంగా ఉంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నా సంయమనం పాటిస్తారు, ఒత్తిడికి గురికారు. పరిస్థితులను సమతుల్యం చేసుకునేలా చూసుకుంటారు.
ధనుస్సు రాశి..
ఈ రాశికి చెందిన వ్యక్తులు సాహసోపేతంగా ఉంటారు. ఎక్కువగా శ్రమ పడేందుకు అస్సలు ఇష్టపడరు. ఏవైనా పరిస్థితులు చాలా ముఖ్యమైనవని తెలిస్తే తప్ప జోక్యం చేసుకునేందుకు ముందుకు రారు. అయితే ఎప్పుడైనా వారు సమస్యలో ఉంటే పరిస్థితులను చాలా చక్కగా, ప్రశాంతంగా నిర్వహిస్తారు. ఒత్తిడిని దరి చేరనివ్వరు.
మకరరాశి
మకరరాశి వారు ఒత్తిడిని ఎదుర్కోవడంలో చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. పరిస్థితి చేయి జారిపోనంత వరకు, ఏదైనా అంశంపై నియంత్రణ కోల్పోనంత వరకు ప్రశాంతతను కోల్పోవడానికి ఇష్టపడరు. వీలైనంత వరకు ప్రశాంతంగా పనులను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ రాశికి చెందినవారు మానసికంగా చాలా దృఢంగా, సహనంతో ఉంటారు. ఏదైనా సమస్యకు తక్షణమే పరిష్కారాలను వెతకగలరు.