Zodiac Signs: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావ్ అని చిన్నప్పుడు అడిగితే... డాక్టరో, యాక్టరో, టీచరో, లాయలో ఏదో ఒకటి అవుతామని చెబుతాం. అది అవుతామా లేదా అన్నది వేరే విషయం... అలాంటి ఓ ఆశయం, కల అనేది ఉండాలి. ఉంటే... ఆ దిశగా మన నిర్ణయాలు ఉంటాయి. మన అడుగులు అటే పడతాయి. అదే ఏ ఆశయమూ లేకపోతే... దిక్సూచి లేని పడవలా... జీవిత పయనం ఎటు సాగుతుందో చెప్పలేం. జీవితంలో విజయం సాధించాలంటే... ఆశయం ఉండాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అది డ్రైవింగ్ ఫోర్సులా పనిచేస్తుంది అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ రోజుల్లో యూత్ చాలా పెద్ద ఆశయాలు కలిగి ఉంటున్నారు. అంతేకాదు... వాళ్లలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా తెలివితో, ఏ గోల్ పెట్టుకుంటే... ఆ గోల్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ల కలలు చాలా పెద్దగా ఉంటున్నాయి. విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇలా ఏటా చాలా మంది గోల్స్ సాధించి... కల నిజం చేసుకొని... విన్నర్‌గా నిలుస్తున్నారు. మరి రాశి చక్రం ప్రకారం... ఏ రాశుల వారు బలమైన ఆశయాలు కలిగివుంటారో... ఏ రాశుల వారు అంతగా ఆశయాలు కలిగి ఉండరో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
సింహ రాశి (Leo) సింహ రాశి వారిలో ఆశయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని రాశుల కంటే వీరికే అది ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వారు ఆధిపత్య ధోరణి ప్రదర్శించగలరు. వీళ్లు పాలించడానికీ, అధికారాన్ని దక్కించుకోవడానికీ ముందుంటారు. తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. కచ్చితంగా గోల్స్ సాధిస్తారు. ఐతే వీరు దయకలికి, సాయం చేసేవారిలా కూడా ఉంటారు.
మకర రాశి (Capricorn) మకర రాశి వారి మైండ్ చాలా క్లియర్‌గా ఉంటుంది. తమ జీవితంలో తమకు ఏం కావాలో వీళ్లకు బాగా తెలుసు. వీళ్లు రూల్స్ పాటిస్తారు. అత్యంత నిబద్ధతతో పాటిస్తారు. వీళ్లు ప్రతీదీ ప్లాన్ ప్రకారం చేస్తారు. ప్లాన్ లేకుండా ఏదీ చెయ్యరు. వీళ్లు కల పెద్దగా ఉంటుంది. దాన్ని సాధించేందుకు జీవితంలో కఠినమైన నిబంధనలు పెట్టుకుంటారు, పాటిస్తారు.
మేష రాశి (Aries) మేష రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్లు సరదాగా ఉంటారు... అప్పటికప్పుడు జోక్స్ వేస్తారు. ఇలాంటి పనితనం వల్ల వీళ్లు శ్రమ తెలియకుండానే చాలా పని చేసేస్తారు. వీళ్లు పోటీలో ఉన్నారంటే... అవతలి వారికి చుక్కలే. గట్టి పోటీ ఇస్తారు. వీళ్లు బాగా ప్రేమిస్తారు. తమ సన్నిహితులతో బాగా ఎటాచ్‌లో ఉంటారు.
మిథున రాశి (Gemini) మిథున రాశి వారికి స్ల్పిట్ పర్సనాల్టీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీరు కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఐతే... ఏం సాధించాలి అనే అంశంపై మాత్రం వీరికి చాలా స్పష్టమైన మైండ్ సెట్ ఉంటుంది. వీళ్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని వాడేసి... జీవితంలో విజయాలు సాధిస్తారు.
వృశ్చిక రాశి (Scorpio) వృశ్చిక రాశి వారు కఠినంగా ఉంటారు, నిబద్ధతతో ఉంటారు, స్వార్థం ఉంటుంది, ఆశయాలు ఎక్కువే, రహస్యాలు మెయింటేన్ చేస్తారు, ఆగ్రహం ఎక్కువే. ఐతే... వీరు చాలా దయకలిగి, నిజాయితీ కలిగి కూడా ఉంటారు. వీళ్లకు టాలెంట్ చాలా ఎక్కువ. వీళ్లకు లోతుగా ఆలోచించే ప్రత్యేక గుణం ఉంటుంది. వీళ్లు ధృడంగా ఉంటారు, లక్ష్య సాధనకు కావాల్సిన వనరులు కలిగి ఉంటారు, ప్రత్యర్థులకు సమస్యాత్మకంగా మారగలరు, ఊహల్లో కాకుండా... లక్ష్య సాధన దిశగా వీరి అడుగులు ఉంటాయి. అందువల్ల వీరు కెరీర్లో ముందుకే వెళ్తారు.
కర్కాటక రాశి (Cancer) కర్కాటక రాశి వారు అంతర్గతంగా లోతుగా (intuitive) ఆలోచించగలరు. అత్యంత నమ్మదగిన వారిగా ఉంటారు. ఇతరుల పట్ల చాలా కేర్ తీసుకుంటారు. వీపరీతమైన దయార్థ్ర హృదయంతో ఉంటారు. మూడీగా కూడా ఉంటారు. లక్ష్యాల సాధనకు సంబంధించి వీళ్లకు ప్రేరణ అవసరం. ఎవరైనా వెంట ఉండి ప్రేరేపించాలి. ఐతే... వీళ్లకు అంతర్గతంగా ఆలోచించే గుణం కారణంగా... వీళ్లు దాన్ని వాడేసుకొని... లక్ష్యాల దిశగా అడుగులు వేయగలరు.
కుంభ రాశి (Aquarius) కుంభరాశి వారు ధైర్యవంతులు, బలమైన నాయకులు, స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వీళ్లు బాగా తెలివైన వారు, క్రియేటివ్‌గా ఆలోచించగలరు. వీళ్లు గంటల తరబడి అలసిపోకుండా పని చెయ్యగలరు. వీళ్లు క్రిటికల్‌గా ఆలోచించగలరు, సొసైటీలో ఏం జరుగుతుందో గ్రహించగలరు, వివిధ అంశాలపై కచ్చితమైన నిశ్చయంతో ఉంటారు. ఇలా వీళ్లు ప్రొపెషనల్‌గా ముందుకు సాగగలరు.
కన్య రాశి (Virgo) కన్య రాశి వారు సంపూర్ణులు. వీళ్లు చేపట్టే ఏ ప్రాజెక్టైనా సంపూర్ణంగా పూర్తి చేస్తారు. ఏ కార్యక్రమమైనా అంతే. వీళ్లు హార్డ్ వర్క్ చేస్తారు. క్రియేటివ్, నమ్మదగిన వారు, సహనం కలిగి ఉంటారు, దయగలవారు, ఒక్కోసారి క్రిటికల్‌గా, మొండిగా కూడా ఉండగలరు. వీళ్లు తెలివైన వారు. మొద్దుబారిన వారిలా కూడా ఉండగలరు. ఇలా రకరకాలుగా ఉంటూనే వీరు పనిని బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి వీళ్లు భారీ గోల్స్ పెట్టుకునే అవసరం రానివ్వరు.
మీన రాశి (Pisces) మిగతా అన్ని రాశుల కంటే క్రియేటివ్ (సృజనాత్మకత) వారు మీన రాశి వారు. వీళ్లు అంతర్గతంగా లోతుగా (intuitive) ఆలోచించగలరు, ఉదార భావంతో ఉంటారు, భావోద్వేగాలు బాగా ఉంటాయి. వీళ్లకు కూడా అంతర్గతంగా లోతుగా ఆలోచించగలిగే గుణం ఉండటం వల్ల... వీరు ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చేసుకోగలరు. వీళ్లు స్వతంత్రంగా కూడా పనిచెయ్యగలరు. వీళ్లు టీమ్ సభ్యుల్ని తయారుచేయడంలో దిట్టలు.
ధనస్సు రాశి (Sagittarius) మొత్తం రాశుల్లో అత్యంత తక్కువగా లక్ష్యాలు కలిగిన వారు ధనస్సు రాశి వారు. వీరు సంతోషంగా ఉంటూ చక్కగా ప్రేమించగలరు. అప్పటికప్పుడు జోక్స్ వెయ్యగలరు. ప్రతి అంశంపై సానుకూలంగా ఉంటారు. నిస్వార్థంతో ఉంటారు. నిజాయితీ ఎక్కువ. స్వేచ్ఛను ఇష్టపడే ప్రేమికులు. వీరు దేనికైనా కట్టుబడి ఉండటాన్ని భరించలేరు. వీళ్లలో క్రియేటివిటీ ఎక్కువ. వీళ్లు మ్యూజిక్, రైటింగ్, ఆర్ట్, డ్రామా లాంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)