కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) మీరు ఆశించిన ఉద్యోగం రావచ్చు కానీ, మీరు కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు. బంధువర్గంలో ఒకరితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు జాగ్రత్త. సంతానం నుంచి శుభవార్త వింటారు. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కామర్స్, టెక్నాలజీ, మేథ్స్ విద్యార్థులకు అనుకూంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో నిరుత్సాహానికి గురయ్యే సూచనలున్నాయి. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.