వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రనులు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. వస్తువులు గానీ, డబ్బు గానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.