మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఏలిన నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, వైద్యుల సహాయంతో కోలుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాలలోని వారు అభివృద్ధి సాధిస్తారు.