మీ చేతి వేళ్లు ఎలా ఉంటాయి: మనం మన చేతుల్నీ, వేళ్లనీ రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఏనాడూ వాటిని పరిశీలనగా చూడం. ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే మాత్రం... చూసుకుంటాం. నిజానికి మనందరి చేతులు, కాళ్లు, శరీర భాగాలు కాస్తో కూస్తో వేర్వేరుగానే ఉంటాయి. కానీ అందరం ఒక్కటే. అందరం మనుషులమే. మన చేతి వేళ్లను పరిశోధకులు 3 రకాలుగా విడగొట్టారు. (Photo Source: Collected)
1వ రకం.. పొడుగు వేళ్లు... తిన్నగా ఉంటాయి... చివర మాత్రం గుండ్రంగా కాకుండా... స్క్వేర్ లా ఉంటుంది. అంటే... గోరు గుండ్రంగా ఉండదు. చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం (rectangle)లా ఉంటుంది. 2వ రకం వేలు కాస్త వంగినట్లుగా ఉంటుంది. చివర మాత్రం కోడి గుడ్డులా కోలగా, పొడవుగా ఉంటుంది. గోరు ఆకారం కోడిగుడ్డులా ఉంటుంది. 3వ రకం వేలు తిన్నగా ఉంటూనే మధ్యమధ్యలో ఎత్తుపల్లాలతో ఉంటుంది. చివర మరీ స్క్వేర్లా ఉండదు, అలాగని కోడిగుడ్డు ఆకారంలోనూ ఉండదు. మధ్యరకంగా ఉంటుంది. వీటి ఆధారంగా ఎవరు ఎలాంటి వారో తెలుసుకుందాం. (Photo Source: Collected)
Type 1: తిన్నటి వేలు ఉన్నవారు... తమ వ్యక్తిగత జీవితాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. తమ భావాలు, రహస్యాలను తమతోనే ఉంచుకుంటారు. ఇలాంటి వారి వ్యక్తిగత విషయాల్ని ఇతరులు తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీరు తమ చుట్టూ ఓ గోడ లాంటిది నిర్మించుకుంటారు. ఆ పరిధి దాటి ఇతరులను లోపలికి రానివ్వరు. వీరికి చాలా దగ్గరగా ఉంటే బెస్ట్ ఫ్రెండ్స్ లాంటి వారు మాత్రమే ఈ వ్యక్తిగత విషయాల్ని తెలుసుకోగలుగుతారు. 1వ రకం వారు చాలా మంచివారు. ఎమోషనల్ టైపు. ప్రతిదానికీ ఫీల్ అవుతారు. జంతువులను బాగా ప్రేమిస్తారు. వీరు పైకి గంభీరంగా ఉన్నా... లోపల ఐస్ క్రీమ్‌లా కరిగిపోయే దయగల హృదయం ఉన్నవారు. వీరికి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది.... అది అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉంటుంది. (Photo Source: Collected)
Type 2: వేళ్లు కాస్త పక్కకు వంగినట్లుగా ఉండేవారు రియల్ పర్సన్లు. వీరు ఒకసారి ఎవరితోనైనా కలిస్తే... ఇక వారిని ఎప్పటికీ వదలరు. వీళ్లు వెంటనే ప్రేమలో పడిపోయే రకం. ఇది మంచి గుణమే అయినప్పటికీ... దీని వల్ల వీరు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే... వీరు వెంటనే ఐలవ్యూ చెప్పేసినా... అవతలి వారు... అదే విధంగా రెస్పాండ్ కాకపోవచ్చు. నో చెప్పవచ్చు. అలాంటప్పుడు తీవ్ర మనస్తాపం చెందే పరిస్థితి రావచ్చు. రాన్రానూ వీళ్లు ఇతరులను నమ్మాలా వద్దా... అనే మీమాంసలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కొత్తవాళ్లను చూడగానే... మోసం చేస్తారేమో అనే భావన కలిగే పరిస్థితి రావచ్చు. ఐతే... వీరి లాగే డీప్ గా ప్రేమించేవారు తోడుగా లభిస్తే మాత్రం వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. వీరికి స్థిరమైన లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా పని చేస్తే అందులో కచ్చితంగా విజయం సాధిస్తారు. (Photo Source: Collected)
Type 3: వేలు ఎత్తుపల్లాలతో ఉన్నవారు... తమ ఆలోచనలు, భావాలకు తగినట్లుగా వ్యవహరిస్తారు. ఐతే... ఒక్కోసారి దాని వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఒక్కోసారి వీరి ఫీలింగ్స్ వల్ల అంతా మేలే జరుగుతుంది. కొన్నిసార్లు మాత్రం.. ఆ ఫీలింగ్సే ఇబ్బంది కలిగిస్తాయి. స్వతంత్రంగా వ్యవహరించనివ్వవు. వీరు వస్తువులు, మనుషులు, జంతువులు అన్నింటితో ఈజీగా కనెక్ట్ అవుతారు. అదే సమయంలో... దేన్నైనా వదులుకోవాలంటే కూడా ఏమాత్రం ఆలోచించకుండా వదులుకుంటారు. వీరు ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టాలని అనుకుంటారు. ఆ క్రమంలో... ఒక్కోసారి తాము సమస్యల్లో ఇరుక్కొని మరీ ఇతరులకు సాయం చేస్తుంటారు. దీని వల్ల వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో పడతారు. (Photo Source: Collected) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)