వృషభ రాశి
వృషభ రాశికి చెందిన మహిళలు అన్నీ తమ ఆధీనంలోనే ఉండాలని భావిస్తారు. భర్త అడుగుజాడల్లో కాకుండా, తన అడుగుజాడల్లో భర్త నడుచుకోవాలని భావిస్తారు. వృషభ రాశి స్త్రీలు తమ వ్యక్తిగత జీవితాన్ని లేదా వృత్తి జీవితాన్నే కాకుండా తమ భాగస్వామి జీవితాన్ని నియంత్రించాలని కోరుకుంటారు. వారు తమ భర్తను అధీనంలోకి తెచ్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.
కన్యా రాశి
కన్యారాశికి చెందిన మహిళలు స్వాతంత్ర్య ఆలోచనలు, స్వేచ్ఛను కలిగి ఉంటారు. ఈ లక్షణం వారి భాగస్వాములపై ఆధిపత్యం చెలాయించేలా చేస్తుంది. తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడం, వారిని అదుపులో పెట్టుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తారు. లొంగిపోయే స్వభావం ఉన్న వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి చెందిన మహిళలు తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించే విషయంలో తమను తాము ఒక ప్రొఫెషనల్‌గా భావిస్తారు. వీరు మైండ్ గేమ్‌లు ఆడటంలో దిట్ట. అనేక టెక్నిక్‌ల ద్వారా భాగస్వామిని మానిప్యులేట్ చేయడంలో సిద్దహస్తులు. వారు తమ భాగస్వాములపై ఆధిపత్యం చెలాయించడంలో విజయం సాధిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)