ఎందుకంటే ఇప్పటికే మేషరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. మెుదటగా సూర్యుడు, రాహువు కలయిక కారణంగా గ్రహణ యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి కష్టకాలం మెుదలుకానుంది. ఊహించని పరిణామాలు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి అంటున్నారు. మరి ఆ రాశులు ఏంటో తెలుసా?
సింహరాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారు ఏప్రిల్లో కొన్ని సమస్యల్లో ఇరుక్కొనే ప్రమాదం ఉంది. ఉద్యోగం విషయంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. పై అధికారులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు.. అలాగే వీరి ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. ఊహించని విధంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా నష్టాలు వస్తాయి. అయితే ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అంటున్నారు.
తులారాశి:
సూర్యుడు, రాహువు కలయిక తులారాశి వారికి సైతం కొన్ని కష్టాలను తెచ్చి పెడుతోంది అంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కొన్ని వార్తలు వినాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ నెలలో వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం.. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం తప్పని సరి అంటున్నారు. అలాగే మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే కొంత వరకు సమస్యలను తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి:
గ్రహణ యోగం వల్ల ఈ రాశి వారికి ఏప్రిల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి అంటున్నారు. ముఖ్యంగా కెరీర్ లో అనేక సమస్యలు వస్తాయి. అయితే శ్రద్ధతో కఠోర శ్రమ చేస్తే.. కాస్త ఇబ్బందులు తప్పుతాయంటున్నారు. అలాగే అనుకోని వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. నగదు లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది అని సూచిస్తున్నారు. దాంపత్య జీవితంలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి:
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఇంకా మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది. ఈ నెలలో వారి కష్టాలు మరికాస్త పెరుగే ప్రమాదం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ సమయం అస్సలు కలిసిరాదు. కుటుంబంలో గొడవలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫంల దక్కదు. ఈ రాశి వారు వీలైనంత వరకు కొత్త పనులు ప్రారంభించకపోవం మంచిది అని సూచిస్తున్నారు.