వెదురు మొక్క (Bamboo)ను ప్రాణంలా చూసుకుంటారు జపాన్ ప్రజలు. మనకు వాస్తు ఎలాగో... వాళ్లకు ఫెంగ్ షుయ్ అలా ఉంటుంది. వాస్తు ప్రకారం... ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, అదృష్టం కలిసిరావాలంటే.. వెదురు మొక్కను పెంచాలట. ఇలా ఒక మొక్కను ఇంట్లో పెంచికే... ఆ ఇంట్లో వారికి విజయాలు సిద్ధిస్తాయట. ఇందులో కొంత సైన్స్ ఉంది. ఎందుకంటే... బాంబూ మొక్క... తన చుట్టూ ఉన్న గాలిలోని చెడు వాయువులు, మూలకాలను లాగేసుకుంటుంది. అందువల్ల ఇంట్లో వారికి మంచి ఆరోగ్యం ఉండి... అంతా మంచే జరుగుతుంది అనుకోవచ్చు. వాస్తు ప్రకారం... బాంబూ మొక్కను ఎక్కడబడితే అక్కట పెట్టకూడదు. మరి మంచి వెదురు మొక్కలేవో, ఏ దిశలో వాటిని ఉంచాలో తెలుసుకుందాం.
Positivity brings energy: వాస్తు ప్రకారం... వెదురు మొక్కలు పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి. ఇంట్లో లేదా ఆఫీసులో వీటిని తూర్పు వైపు ఉంచితే... చాలా మంచిద. ముఖ్యంగా కుటుంబ సభ్యులంతా ఓ చోట కూర్చుంటే... ఆ సిట్టింగ్ ఏరియా దగ్గర తూర్పువైపు నెమ్మదిగా పెరిగే బాంబూ మొక్కను ఉంచాలి. అది హైబ్రీడ్ జాతి కాబట్టి... ఎక్కువ ఎత్తు పెరగదు. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి.
There is peace in the house: తూర్పు అనేది మనకు అత్యంత పవిత్రమైన దిక్కు. ఉదయాన్నే తూర్పున సూర్యుణ్ని చూడటం, సూర్య నమస్కారం చేయడం ఇండియాలో ఆచారం. అలాంటి తూర్పువైపున వెదురు మొక్క లేదా చెట్టును పెంచడం ద్వారా... కుటుంబ సభ్యులు తరచూ ఆ పచ్చదనాన్ని చూస్తూ... మానసికంగా ఆనందాన్ని పొందుతారు. తద్వారా వారికి తెలియకుండానే వారి శరీర కణాలు ఉత్తేజితం అవుతాయి. తద్వారా ఇంట్లో వారంతా ప్రశాంతంగా ఉంటూ... ఆ ఇంట శాంతి ఉంటుంది. ఎప్పుడైతే మనస్పర్థలు లేవో... అంతా బాగుంటుంది.
Money comes: బాంబూ చెట్లకు డబ్బులు కాయవు. కానీ... పనిచేసే చోట... ఈ మొక్కను పెంచుకుంటే... ఇది గాలిని క్లీన్ చేస్తుంది. తద్వారా మెదడుకు మంచి ఆక్సిజన్ లభిస్తుంది. దాంతో... పని బాగా చేస్తారు. పనిలో టార్గెట్లు చేరుకుంటారు. తద్వారా సమయానికి ప్రాజెక్టులు పూర్తై... కంపెనీకి డబ్బు అందుతుంది. తద్వారా ఉద్యోగులకూ సమయానికి శాలరీలు, ఇతరత్రా అన్నీ లభిస్తాయి. ఇళ్లలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. అందుకే ఈ మొక్కను తప్పక పెంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)