Vastu Tips : ఇంట్లో సాలీళ్లు ఉన్నాయా.. ఇలా చెయ్యకపోతే అప్పులు, సమస్యలే!
Vastu Tips : ఇంట్లో సాలీళ్లు ఉన్నాయా.. ఇలా చెయ్యకపోతే అప్పులు, సమస్యలే!
Vastu Shastra Tips : మీ ఇంట్లో సాలీళ్లు ఉన్నాయా? గూళ్లు కడుతున్నాయా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. వాస్తు శాస్త్రంలో సాలీళ్లకు సంబంధించి ఏం చెప్పారో నిపుణుల ద్వారా తెలుసుకుందాం.
వాస్త్రు శాస్త్రం ప్రకారం సాలీళ్లు ఇళ్లలో ఉండటం మంచిది కాదు. అలాగని వాస్తు శాస్త్రం.. సాలీళ్లను తప్పుపట్టట్లేదు. కానీ.. అవి ఇళ్లలో మాత్రం ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సాలీళ్లు కట్టే గూళ్ల వల్ల ఇళ్లలో నెగెటివ్ ఎనర్జీ పోగవుతుందని చెబుతున్నారు.
2/ 6
వాస్తు ప్రకారం... ఇంట్లోని ఏ గదిలో సాలీడు గూడు ఉన్నా... సాలీడును చంపకుండా... గూడును మాత్రం తొలగించాలి. సాలీడును ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేలా చెయ్యాలి. గూడును తొలగించగానే... నెగెటివ్ ఎనర్జీ కూడా బయటకు పోతుంది.
3/ 6
సాలీడు గూళ్లు ఉన్న ఇళ్లలో కష్టాలుంటాయి. ఎప్పుడూ ఏదో ఒక రకమైన సమస్య వస్తూనే ఉంటుంది. డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి.. ఏదో ఒక కారణంతో పోతూ ఉంటుంది. ఒక్కోసారి అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల సాలిపురుగుల గూళ్లు ఇళ్లలో లేకుండా చూసుకోవాలి.
4/ 6
స్పైడర్ వెబ్ ఉన్న ఇళ్లలో వారికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య దిశలో సాలెగూళ్లు ఉంటే... వాటి నుంచి నెగెటివ్ ఎనర్జీ ఇల్లంతా ప్రవహించగలదు. తద్వారా ఇంట్లోని వారంతా... అనారోగ్యాలతో బాధపడే ప్రమాదం ఉంటుంది.
5/ 6
సాలీళ్ల వల్ల వాస్తు దోషం రాకుండా ఉండాలంటే... ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. గోడలు, మూలలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోకి కాంతి బాగా వచ్చేలా చేసుకోవాలని సూచిస్తున్నారు.
6/ 6
Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.