హిందూ పురాణాల ప్రకారం.. శివ ఆగమ శాస్త్రం ప్రకారం శివుడి ఆరాధన అభిషేకంతో ప్రారంభమవుతుంది. ఇది ప్రధానంగా నీరు, పాలు, తేనె, ఇతర తినగలిగే పదార్థాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తారు. అయితే, ఇలా అభిషేకంతో మొదలైన పూజకు మరింత ఫలితం లభిస్తుందని నమ్ముతారు. మన పూర్తీకుల కాలం నుంచి శివుడికి జరిపించే రుద్రాభిషేకం కూడా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీళ్లు, పవిత్రమైన విభూది, గంధం, పండ్ల రసాలతో అభిషేకిస్తారు. కానీ, ఇందులో పాలకే అధిక ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది.
అదేవిధంగా, పవిత్ర జలం పోసిన తర్వాత పాలు పోయడం వల్ల మెదడు , ఆత్మను మంచితనం, కరుణ, గొప్ప ఆలోచనలు, సాత్విక్ మనస్తత్వంతో పెంపొందించుకుంటాయని నమ్ముతారు. సరైన మార్గంలో అభిషేకం చేయడం గత జన్మలలో చేసిన అన్ని చెడు కర్మలను కాల్చడంలో సహాయపడుతుందని నమ్ముతారు. చివరగా, దేవతను తేనెతో పూజించడం వల్ల స్వరంలో, ఆలోచనల్లో మాధుర్యం వస్తుంది.