శృంగారం.. ఒక వ్యక్తిపై ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇంతకంటే ముఖ్యమైన ప్రక్రియ ఉండదు. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమను తార స్థాయికి తీసుకెళ్లే కార్యం ఇది. ఆలుమగల అనురాగానికి ఏకాంత రూపం. పడకగదిలో జీవిత భాగస్వామితో అన్యోన్యాన్ని పెంచే అద్భుత విధానం. జ్యోతిషశాస్త్రం ప్రకారం జన్మ రాశుల ఆధారంగా వ్యక్తుల లక్షణాలను, సంబంధాలను అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో రాశుల ఆధారంగా శృంగార జీవితం ఎలా ఉండాలో చూద్దాం.
వృషభం (ఏప్రిల్ 2- మే 20)- కొంటెగా మాట్లాడుతూ ప్రేరిపించాలి..
వృషభ రాశి వారు సున్నిత మనస్కులు. శృంగారంలో భౌతిక స్పర్శ ద్వారా ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు. లేదంటే డర్టీ టాక్ ద్వారా ఎదుటివారిని సెక్స్ విషయంలో ప్రేరేపించవచ్చు. అంటే కొంటేగా మాట్లాడుతూ శృంగారంలో ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా జీవితంలో సెక్స్ లో తర్వాతి స్థాయికి వెళ్లవచ్చు.
మిథునం (మే 21- జూన్ 20)- వాతావరణం సరిగ్గా ఉండాలి..
వేగంగా కార్యం ముగించడం వల్ల ఫలితం ఉండదు. ముఖ్యంగా మిథున రాశి వారు వేగాన్ని తగ్గించి శృంగారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే గదిలో వాతావరణం కీలకం. ఉష్ణోగ్రత సరిగ్గా ఉండాలి. బెడ్ షీట్స్ నాణ్యంగా ఉండాలి. తద్వారా మిథున రాశి వారు శృంగార జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చు.
కన్య (ఆగస్టు 23- సెప్టెంబరు 22)- ఆధిపత్యం చెలాయించడం.. కన్యా రాశి వారు శృంగారాన్ని సర్వీస్ లా భావిస్తారు. పడకగదిలో ఆధిపత్యం చెలాయించడం వల్ల వీరి సెక్స్ లైఫ్ సంతోషంగా ఉంటుంది. రోల్ ప్లే లో కన్యా రాశి వారి లైంగిక జీవితం సరికొత్తగా అనిపిస్తుంది. అంతేకాకుండా జీవితంలో అత్యుత్తమ శృంగార అనుభూతిని పొందుతారు.
ధనుస్సు (నవంబరు 22- డిసెంబరు 21)- ఎక్కువ రిస్క్ తీసుకోండి..
ధనుస్సు రాశి ప్రజలు ఉద్వేగభరితంగా ఉంటారు. అగ్నితత్వాన్ని కలిగి ఉండే ఈ రాశి వారు కొంచెం రిస్క్ తీసుకోవడం అవసరం. అది పడకగదిలోనూ ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. సరైన విలుకాడిపై లక్ష్యం పెద్దగా ప్రభావం చూపదు. మీ రాశి వారికి ఈ విషయంలో అలాగే ఉంటుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 19)- రిలాక్స్..
మకర రాశి ప్రజలు పని దేవుళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో పడకగదిలో మూడ్ తెచ్చుకోవడానికి అరోమాథెరపీ, మసాజ్ లాంటివి అవసరం. మకర రాశి వారు ప్రత్యేకంగా షవర్, ఫోర్ ప్లే చేయడం అదనపు సెక్సీ మసాజ్ కోసం లోషన్లు, సాల్వ్ లతో ప్రయోగాలు చేయడం వల్ల మరింత హీట్ ఉత్పత్తి అవుతుంది.