GemStones for Prosperity and Wealth: ఆర్థికంగా బలంగా ఉండడం ఈ రోజులు అత్యవసరం. డబ్బు లేనిదే ఏదీ కాదు.. అయితే ఆ డబ్బు ఎవరికీ ఊరికే రాదు.. దాని కోసం శ్రమించాలి.. అంతేకాదు చాలా పొదుపుగా ఉండాలి.. సంపాదన మార్గాలు పెంచుకోవాలి.. అప్పుడు అవసరానికి సరిపడ ఆదాయం మన సొంతం అవుతుంది. అయితే సంపాదన బాగానే ఉన్నా... కొన్ని సార్లు అది నిలవదు..
ఎందుకంటే వ్యక్తి ఆర్థిక ఎదుగుదలకు దోహదపడే కొన్ని రత్నాలు రత్నశాస్త్రంలో సూచించబడ్డాయి. అందులో 3 ప్రత్యేక రత్నాల గురించి తెలుసుకోవాలి అంటున్నారు. అయితే రత్నశాస్త్రంలో కొన్ని రత్నాలు వ్యక్తుల ఆర్థిక పురోగతికి దోహదపడుతాయి. అది కూడా వారి జాతకంపైనే ఆధారపడి ఉంటుంది. జాతక రీత్యా ఆయా రాశుల వారికి ప్రత్యేక రత్నాలు సూచించబడ్డాయి.
రత్నశాస్త్రం ప్రకారం జాతక ఆధారంగా కొన్ని రత్నాలు ధరించడం వారికి కలిసొస్తుందని రత్న శాస్త్ర నిపుణులు చెబుతారు. వ్యక్తుల ఆర్థిక పురోగతి కోసం రత్న శాస్త్రంలో 3 ప్రత్యేక రత్నాలు ఉన్నాయి. జేడ్ స్టోన్, ఆకుపచ్చ అవెంచురిన్, పులి రత్నాలు.. ఈ మూడింటితో ప్రత్యేక లాభాలు ఉన్నాయి అంటున్నారు. అయితే ఇవి ఏ రాశుల వారు ధరించాలో తెలుసా..?
జేడ్ స్టోన్ ఉపయోగ..? ఏ రాశుల వారు ధరించాలి:
రత్న శాస్త్రంలో సూచించిన రత్నాల్లో జేడ్ స్టోన్ ఒకటి. ఈ స్టోన్ని ధరించడం వల్ల వ్యక్తి ఆర్థికంగా పురోగతి చెందుతాడు. అంతే కాదు, చేపట్టిన పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. పచ్చ రాయి అనేది పచ్చ రత్నం, ఇది ఆర్థిక సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.
ఈ రత్నం సహాయంతో వ్యాపారపరమైన నిర్ణయాల్లో సరైన ధోరణితో వ్యవహరించగలరు. కొత్త ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏ రాశుల వారు ధరించాలి అంటే..? జేడ్ స్టోన్ని వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారు ధరించవచ్చు. అయితే జ్యోతిష్యుని సలహా మేరకు వాడాలని గుర్తుంచుకోండి.
పులి రత్నాలు ప్రయోజనాలు..? ఏ రాశి వారు ధరించాలి:
రత్న శాస్త్రంలో, ఈ రత్నం అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపేదిగా పరిగణించబడుతుంది. దీన్ని ధరించడం వల్ల వ్యక్తి దృఢ సంకల్పం పెరుగుతుంది. కష్ట సమయాల్లో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులు వేగం పుంజుకుంటాయి. ఏ రాశి వారు ధరించాలి అంటే..? రత్న శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పులి రత్నాలు మిథున రాశి వారు ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు.