జీవితంలో ప్రతి ఒక్కరు లక్ష్యాలను (Goals) నిర్దేశించుకుంటారు. అయితే కొంత మంది మాత్రమే వాటిపై సీరియస్‌గా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నంత సులభంగా దాన్ని సాధించలేం. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రమే తమ లక్ష్యం పట్ల నిబద్ధతతో పనిచేస్తారు. తాము అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఫోకస్‌తో పనిచేస్తారు. ఎల్లప్పుడూ వారి గురి లక్ష్యంపైనా ఉంటుంది.
లక్ష్య సాధన (Goals) తప్ప.. మిగతా ఏ ఇతర విషయాలనూ వారు పట్టించుకోరు. వారి లక్ష్యాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇవ్వడంలో అగ్రస్థానంలో ఉంటారు. వారు చేసే పనులతో ఇతరుల మెప్పు పొందుతారు. అలాంటి వారికి, కష్టపడి పనిచేయడం తప్ప.. సులభమైన మార్గాలను అస్సలు నమ్ముకోరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, లక్ష్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేసే రాశుల (zodiac signs) వారి గురించి తెలుసుకుందాం.
కుంభ రాశి.. కుంభరాశి వారు ఎల్లప్పుడూ లక్ష్యం ఆధారంగా పనిచేస్తారు. వారికి తమ లక్ష్యంపై, దాని కోసం ఎలా పనిచేయాలనే దానిపై స్పష్టత ఉంటుంది. దాని కోసం నిరంతరం శ్రమిస్తారు. దాని సాధనలో ఎదురయ్యే ఇబ్బందులను సైతం ముందుగానే గ్రహిస్తారు. ఒక ప్రణాళిక ప్రకారం ఇబ్బందులు దాటుకుంటూ లక్ష్యాన్ని సాధిస్తారు. అనవసర విషయాలను అస్సలు పట్టించుకోరు. వారికి ఉపయోగపడని వ్యక్తిగత లేదా వృత్తిపరమై ఏ విషయాన్నైనా వదిలేస్తారు.
సింహ రాశి.. సింహరాశి వారు సైతం తమ లక్ష్యం కోసం కష్టపడి పని చేస్తారు. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికతో ముందుకు వెళ్తారు. వారు ఏ పని చేపట్టినా సరే దానిలో పరిపూర్ణత సాధిస్తారు. లక్ష్యం కోసం తమ వ్యక్తిగత ఆసక్తులను కూడా త్యజించి ఫోకస్‌గా పనిచేస్తారు. తద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. అయితే వారు మొదట చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని సాధిస్తూ.. పెద్ద లక్ష్యానికి గురిపెడతారు. అస్సలు సమయం వృథా చేయరు.
ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారు తమ చుట్టూ ఉన్న వారి కంటే ఉత్తమంగా రాణించాలని ఎల్లప్పుడూ తాపత్రయపడతారు. చేపట్టిన ఏ పనిలోనైనా పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. తమ లక్ష్య సాధన కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి జీవితంలో లక్ష్యాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వీరు సహజంగా వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన లక్ష్యాలనే నిర్ధేశించుకుంటారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)