Vastu Tips For Broom: వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గతంలో కేవలం ధనవంతులు.. బాగా అవగాహన ఉన్నవారు మాత్రమే వాస్తును నమ్మేవారు.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాస్తుకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు.. ప్రతి విషయంలో వాస్తు కరెక్టుగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే చీపురు విషయంలోన కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయని తెలుసా..?
ముఖ్యంగా సమయంస్త్రంలో చిపురును లక్ష్మి దేవిగా భావిస్తారు. అయితే లక్ష్మి దేవిగా భావించే చీపురుతో సాయంత్రం తరువాత ఉడ్చేవారు ఎవరైనా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి అంటున్నారు. సమయం, సందర్భం లేకుండా ఊడ్చడం వల్ల ఇంట్లో దరిద్రం వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం సూచించిన సమయాల్లో మాత్రమే ఇంట్లో ఊడ్చుకోవాలన్నది వారి సలహా..
రాత్రి పూట చిపురుతో ఊడ్చుతే అశుభమేనా..?
వాస్తు శాస్త్రం ప్రకారం.. రాత్రిపూట ఇంట్లో చీపురుతో ఊడ్చుకుంటే అశుభం కలుగుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని.. ఇంట్లో దరిద్రం పెరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అలాంటి వారంతా ఈ చీపురుతో ఎప్పుడు తుడిస్తే మంచిది అన్నవిషయాలు తప్పవక తెలుసుకోవాల్సి ఉంది.
ఊడ్చుకోవడానికి సరైన సమయం ఏది..?:
ఇంటి శుభ్రత కోసం చీపురుతో ఏఏ సందర్భాల్లో ఊడ్చాలి అన్న విషయాలను తెలుసుకోండి. ఒక రోజు మొత్తం నాలుగు సార్లు ఊడ్చుకోవచ్చని వాస్తు శాస్త్రంలో పేర్కొంది. ఇల్లు ఊడ్చుకోవడానికి సరైన సమయం ఉదయమేనని నిపుణులు తెలుపుతున్నారు. సాయంత్రం పూట ఇల్లును చిపురితో శుభ్రం చేయడం మంచిదికాదని సూచిస్తుంది.
చీపురు ఏ దిక్కులో ఉంచాలి?:
ఇక చీపురును సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యమని శాస్త్రం చెబుతోంది. చీపురు ఇంటికి పశ్చిమ దిశలో ఉంచాలని తెలిపింది. అలా ఉంచితే లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందని.. ఖర్చులు తగ్గుతాయని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇతర దిశల్లో చీపురు ఉంచడం వల్ల నష్టాలు కూడా తప్పవని హెచ్చరిస్తున్నారు.