Mangal Dosh: హిందు జ్యోతిష శాస్త్రం ప్రకారం... కుజగ్రహం (Mars లేదా అంగారకగ్రహం)... గృహంలోని 1, 2, 4, 7, 8, 12వ స్థానంలోకి వచ్చినప్పుడు మంగళదోషం ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో పుట్టిన వారికి మంగళదోషం కలుగుతుంది. దీన్నే కుజదోషం అని కూడా పిలుస్తారు. మంగళదోషం అనేది మంచిది కాదు. 1వ స్థానం లగ్నం, 2వ స్థానం కుటుంభం, 4వ స్థానం సౌఖ్యం, 7వ స్థానం వివాహం, 8వ స్థానం వయసు, 12వ స్థానం ప్రాబల్యం. ఈ దోషం 2 రకాలుగా ఉంటుంది. చిన్న దోషం, పెద్ద దోషం. (ప్రతీకాత్మక చిత్రం)
మంగళదోషం సమస్య: కుజదోషం ఉన్న మహిళలు... వాస్తవంగా ఉంటారు. తమను తాము గాయపరచుకుంటారు. కఠువుగా ప్రవర్తిస్తారు. ఆటపట్టిస్తున్నట్లు చేస్తూ... హాని చేసుకుంటారు. అదే కుజదోషం ఉన్న మగవాళ్లైతే... దూకుడుగా ఉంటారు. అనుమానాస్పదంగా ప్రవర్తిస్తారు. వారు తమ భార్యను ఇంటికే పరిమితం చెయ్యాలనుకుంటారు. వారు విధ్వంసపూరిత, అహంకారపూరిత ధోరణితో ఉంటారు. కుజగ్రహం... శక్తి, గౌరవం, స్వాభిమానం, అహంకారం, నమ్మకం, దూకుడు, దృఢ నిశ్చయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మంగళదోషం లక్షణాలు: కుజదోషం ఉన్నవారికి వారి వైవాహిక జీవితంపై ప్రభావం పడుతుంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. మనస్శాంతి ఉండదు. మహిళలు, పురుషులు... ఎవరికైనా కుజ దోషం ఉండగలదు. కుజదోషం ఉన్నవారు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. ఈ జన్మలో తమ భాగస్వామిని ఎవరైతే సరిగా చూసుకోరో... వారు వచ్చే జన్మలో కుజదోషంతో పుడతారని పండితులు చెబుతున్నారు. కుజదోషం ఉన్నవారికి చాలా పవర్ ఉంటుంది. దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కుజదోషం ఉన్నవారు మంగళవారం పుట్టి ఉంటే... దోష ప్రభావం కనిపించదు. ఇద్దరు కుజదోషం ఉన్నవారు పెళ్లి చేసుకుంటే... సమస్యలు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
కుజదోషంతో నష్టాలు: వైవాహిక జీవితంలో ఉత్తినే గొడవలు జరుగుతాయి. ఇలాంటి వ్యక్తులకు శత్రువులు పెరుగుతారు. చిన్న వాదనలు ఒక్కోసారి హింసకు దారితీస్తాయి. వివాహ సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉండదు. కుటుంబంలో మిగతా వారిపై ఆధిక్యం చెలాయించాలని చూస్తారు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. మనస్శాంతి ఉండదు. తల్లిదండ్రుల ఆస్తిని వారసులుగా కాపాడలేరు. బద్ధకస్తులు అవుతారు. ఉన్న స్థితిని కూడా కోల్పోతుంటారు. కంటి సమస్యలు వస్తాయి. విశ్రాంతి ఉండదు. నమ్మకం ఉండదు. స్వాభిమానం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
కుజదోష నివారణ: కుంభ వివాహం చేసుకోవాలి. మరో కుజదోషం ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలి. ఉపవాసం ఉండాలి. మంత్రాలు జపించాలి. దానధర్మాలు చెయ్యాలి. రంగురాళ్లు ధరించాలి. 28 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలి. నవగ్రహ ఆలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించాలి. తమ రాశిఫలాలను తరచూ విశ్లేషించుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)