Dhana Yoga: ధనం మూలం ఇదం జగత్ అంటారు... అవును మరి... డబ్బు లేకపోతే... ఏదీ చెయ్యలేం. అన్నింటికీ డబ్బే ముఖ్యం. డబ్బుతో అన్నీ కొనలేకపోవచ్చు... కానీ డబ్బుంటే... ఎన్నో ప్రయోజనాలు, ఎంతో కాన్ఫిడెన్స్... ఇంకా చాలా ఉంటాయి. కానీ కొంత మంది ఎంత సంపాదించినా... చేతిలో డబ్బు మిగలదు... మరికొందరికి సంపాదిద్దామన్నా ఛాన్స్ దొరకదు. అప్పుల్లో కూరుకుపోతారు. ధన యోగం పడితే మాత్రం... అప్పుల బాధలు తీరిపోవడమే కాదు... సిరిసంపదలతో హాయిగా జీవిస్తారని చెబుతున్నారు. ఐతే... ధన యోగం విషయంలో కొన్ని అపశ్రుతులు కూడా ఉంటాయి. వాటికి పరిహారం కూడా ఉంటుంది. ఆ వివరాలన్నీ తెలుసుకుందాం.
2వ, 11వ, 5వ, 9వ గృహాలు... తమ తమ అధిపతులైన దేవుళ్లతో కలిస్తే... ఆ యోగం ధన రూపంలో లభిస్తుంది. డబ్బు వస్తుంది, సంపన్నులు అవుతారు. దాన్నే ధన యోగం అంటారు. మొదటి గృహాన్ని లగ్నం అంటారు. రెండో గృహాన్ని సంపదకు ప్రతినిధిగా భావిస్తారు. 11వ గృహం సంపద ప్రవహించేలా చేస్తుంది. 5వ గృహం లాభం, 9వ గృహం... అకస్మాత్తుగా, ఉన్నపళంగా లాభాలు వచ్చేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు. శక్తిమంతమైన 2, 11 గృహాలు, వాటి వెంటే 5, 9 గృహాలు వస్తే... లక్ష్మీదేవి... సంపదను కురిపిస్తుంది.
General Traits: సంపన్నులు కచ్చితత్వంతో ఉంటారు. వారి జీవితం పద్ధతిగా సగుతుంది. వాళ్లలో నమ్మకం, ఎనర్జీ బాగా ఉంటాయి. రిస్క్ తీసుకోవడానికి వెనకాడరు. ధనయోగం లేని వారికి ఇవన్నీ సమస్యలుగానే ఉంటాయి. 2వ గృహం సంపదకు సంబంధించిన అన్ని వ్యవహారాల్ని చక్కబెట్టేస్తుంది. ఇది డబ్బు వచ్చే మార్గాల్ని పెంచుతుంది. ఐతే... అతిగా ఆశిస్తే... దురాశ కూడా కలిగిస్తుంది. 5వ గృహం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతీ పనీ సక్సెస్ అవుతుంది. 9వ గృహం వల్ల... ధైవ భక్తి పెరుగుతుంది. విద్య, కెరీర్ మెరుగవుతాయి. 11వ గృహం మానవత్వాన్ని పెంచుతుంది. ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. స్నేహితులు, ఉద్యోగం అన్నీ కలిసొస్తాయి.
Positive Effects: 10వ గృహంలో దానికి అధిపతి అయిన దైవం కేంద్ర స్థానంలో ఉంటే... ధనయోగం పట్టిన వారు తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపాదిస్తారు. 7వ గృహంలో కుజుడు లేదా 11వ గృహంలో శని ఉంటే.. భారీగా సంపద వస్తుంది. 11వ గృహంలో కేతు ఉంటే... విదేశీ ధనం సంపాదిస్తారు. 2వ, 8వ గృహంలో దైవం కేంద్ర స్థానంలో ఉంటే... చేసే పనితో బాగా సంపాదిస్తారు. బుధుడు... కర్కాటక రాశి, మేష రాశిలో ఉంటే... ఆ వ్యక్తులు సంపన్నులు అవుతారు. సూర్యుడు 5వ, కుజుడు 4వ, గురువు 11వ గృహంలో ఉంటే... పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది. అన్ని కేంద్రాల్లో గ్రహాలు ఉంటే... ధన ప్రవాహమే.