ఈ ఆరానే ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ (electromagnetic field) అంటున్నారు. ప్రాచీన వైద్య శాస్త్రాల ప్రకారం... ఆరా అనేది... 7 పొరలు (7 Layers) గా ఉంటుంది. ఒక్కో పొరా... ఒక్కో అంశాన్ని చైతన్యవంతం చేస్తుంది. అంటే శారీరక, మానసిక, దైవత్వ, భావోద్వేగ ఇలా ఏడు రకాల అంశాలను చైతన్యవంతం చేస్తూ... మనల్ని ఈ ఆరా ఆరోగ్యవంతంగా ఉంచుతుందని అంటున్నారు. ఒకరి ఆరాలోకి మరొకరి ఆరా టచ్ అయితే... ఆరోగ్యం విషయంలో తేడాలు వస్తాయని చెబుతున్నారు.
మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయనీ... ఒక్కో ఆరా... ఒక్కో చక్రం ఎలా పనిచేస్తోందనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రాణాయామం (pranayama) ద్వారా... ఈ ఆరాను బలంగా, ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)