Valentines day 2023: ఈ వాలెంటైన్స్ డే ఏ రాశి వారికి ఎలా ఉండనుంది?
Valentines day 2023: ఈ వాలెంటైన్స్ డే ఏ రాశి వారికి ఎలా ఉండనుంది?
Valentines day 2023: వాలెంటైన్స్ డేకి టైమ్ దగ్గర పడుతుండడంతో ఎవరికి వారు తమ ప్లాన్స్‌కు పదును పెడుతున్నారు. కొత్తగా పెళ్లైన జంటలు, ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న లవర్స్.. కొత్తగా తమ ప్రేమను చెప్పాలను భావిస్తున్న వాళ్లు.. ఇలా ఎవరి ఐడియాలను వారికి ఉన్నాయి. మరి ఈ వాలెంటైన్స్ డే ఏ రాశి వారికి ఎలా ఉండనుంది? జ్యోతిష్కులు ఏమంటున్నారు..?
మేషం: ఈ వాలెంటైన్స్ డే వీళ్లకి చాలా సైలెంట్‌గా ఉండనుంది. తమ జీవితంలో ప్రేమ ఎలా ఉండాలనుకుంటున్నారో ఈ వాలెంటైన్స్ డేన వీళ్లు ఆలోచిస్తారు.
2/ 12
వృషభ రాశి: ఈ రాశి వారు వాలెంటైన్స్ డే రోజున ఎర్ర గులాబీలను ఇవ్వడం ద్వారా ప్రేయసి, లేదా ప్రియుడిని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ వాలెంటైన్స్ డే వీళ్లకి చాలా సంతోషంగా గడుస్తుంది.
3/ 12
మిథున రాశి: మిథున రాశి వాళ్లకి వివిద భాషల మక్కువ. ఐ లవ్ యూ అని రెండు లేదా మూడు భాషల్లో ఎలా చెప్పాలో నేర్చుకొని తమ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయాలని భావిస్తారు.
4/ 12
కర్కాటకరాశి: రిలేషన్‌షిప్‌పై ఈసారి వీళ్లకి పక్కా క్లారిటీ వస్తుంది. ఒక బంధంలో ఏం కోరుకుంటున్నాం అన్నదానిపై ఫోకస్ ఉంచుతారు. ఎవరితో ఉండాలి.. ఎవరికి దూరంగా ఉండాలన్నదానిపై ఎక్కువగా ఆలోచిస్తారు.
5/ 12
సింహ రాశి: ఈ వాలెంటైన్స్ డే మీ కోసం మిక్స్‌డ్‌గా ఉండబోతోంది. ఇక అనవసరమైన పనులు చేయకుండా ఉండండి. గిఫ్ట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
6/ 12
కన్య రాశి: కన్యా రాశివారికి ఈ సారి వాలెంటైన్స్ డే చాలా రొమాంటిక్ రోజుగా ఉండిపోనుంది. పరస్పర విభేదాలను అధిగమిస్తారు కూడా.
7/ 12
తులా రాశి: తమ సెల్ప్ ఆనందాలపై దృష్టి పెడితే మంచిదని జోత్యిష్కులు చెబుతున్నారు. ఇతరుల చుట్టూ ఉండడం అంత మంచిది కాదట.
8/ 12
వృశ్చిక రాశి: ఒకరికి ఆతిథ్యం ఇవ్వండి, లేదా మరొకరి ఇంటికి వెళ్లండి. ఈ వాలెంటైన్స్ డే వృశ్చిక రాశి వారికి తమలోని సృజనాత్మకను బయటకు తీసుకువస్తుంది.
9/ 12
ధనుస్సు - ఒక చిన్న పొరపాటు మీ సంబంధాన్ని శాశ్వతంగా విచ్ఛిన్నం చేయగలదని గుర్తుంచుకోండి.
10/ 12
మకర రాశి: ప్రేమికుల రోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ సంబంధం ముందుకు సాగవచ్చు.
11/ 12
కుంభ రాశి: కుంభ రాశి వారికి, వాలెంటైన్స్ డే స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని తెస్తుంది.
12/ 12
మీన రాశి: ప్రేమ ప్రవాహంలో గడుపుతారు. ఈ రాశివారు ఆ వాలెంటైన్స్ డేన ఎంతో హ్యాపీగా గడుపుతారు.