మేష రాశి (Aries): ఆర్థికపరంగా చాలావరకు అనుకూల కాలం నడుస్తోంది. ఉద్యోగులు అధికార యోగం అనుభవించే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతాన యోగం కనిపిస్తోంది.
వృషభ రాశి (Taurus): శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బాగా కలిసి వచ్చే కాలం ఇది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, అనుకోకుండా అదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘ౦లో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినప్పటికీ సత్ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక చింతనకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణతలు సాధిస్తారు. వృత్తి నిపుణులకు, లాయర్లకు, డాక్టర్లకు పని ఒత్తిడి కాస్తంత అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందదాయకంగా గడిచిపోతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి.
మిథున రాశి (Gemini): ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సహోద్యోగులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అష్టమ శని కారణంగా ప్రతి పనీ అలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని విజయవంతంగా పూర్తవుతాయి. మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ది సాధిస్తారు.
కర్కాటక రాశి (Cancer): మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. బరువు బాధ్యతలతో కూడిన అధికార యోగం పట్టే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది.ఆరోగ్యానికి, అదాయానికి తిరుగులేదు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. అవసరాలకు తగ్గ డబ్బు అందుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. యేమ వ్యవహారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు, లాయర్లకు అన్ని విధాలా బాగుంటుంది.
సింహ రాశి (Leo): ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. కుటుంబపరంగా కొన్ని అనుకోని చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా మాత్రం అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధువర్గంలో మంచి పెళ్ళి సంబంధం కుదురుతుంది. వ్యాపారులు తేలికగా లాభాలు అర్జిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలం గా ఉంది. ఆరోగ్యం ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్పు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి సత్ఫలితాలు సాధిస్తారు.
కన్య రాశి (Virgo): ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ సంబధమైన అంశాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్ధులు తేలికగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా కామర్స్, అకౌంట్స్ విద్యార్ధులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు బాగానే ఉంటాయి. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసు లకు సమయం అనుకూలంగా ఉంది.
తుల రాశి (Libra): ఇల్లు లేదా స్థలం కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది.
వృశ్చిక రాశి (Scorpio): ఈ వారం కొద్దిగా గ్రహాల ప్రతికూలత ఉన్నా, చాలావరకు ప్రశాంతంగానే గడిచిపోతుంది. కొన్ని శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. స్నేహితులు, సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక, సేవా రంగాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలతో సమస్యల్లో పడతారు. ఆరోగ్యం జాగ్రత్త. బాగా ఒత్తిడి ఉంటుంది.
ధనస్సు రాశి (Sagittarius): ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఉన్న ఊరిలోనే ఉద్యోగం రావచ్చు. ఆదాయం నిలకడగాఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు బిజీ అయిపోతారు. (పేమ వ్యవహారాలు సానుకూలం అవుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. నమ్మినవారు మోసగిస్తారు.
మకర రాశి (Capricorn): అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు, మీకు రావాల్సిన డబ్బు కూడా అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా బాగుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ అవసరం. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కామర్స్, బ్యాంకింగ్, అర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.
కుంభ రాశి (Aquarius): ఎలిన్నాటి శని జరుగుతున్న కారణంగా అటు కుటుంబంలోనూ, ఇటు ఉద్యోగంలోనూ కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. అయితే, ఆత్మవిశ్వాసంతో మీరు వాటిని అధిగమించడం జరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. కొద్దిగా తిప్పట ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకోవడం మీద శ్రద్ధ పెడతారు. కొన్ని అర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులకు సమయం అన్ని విధాలా అనురూలంగా ఉంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది.
మీన రాశి (Pisces): ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యానికి నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యం ఇస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. డైలమాలో ఉన్నవారు ముందడుగు వేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలున్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాలవారికి, వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.