మేష రాశి (Aries): వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణించి మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశీ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల పంట సండుతుంది. ఆకస్మికధనలాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు సంభవం. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఢోకాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. కామర్స్, ఆర్కియాలజీ, పరిశోధక విద్యార్ధులకు చాలా బాగుంది.
వృషభ రాశి (Taurus): నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు పెద్ద సంస్థల ను౦చి ఆఫర్లు వస్తాయి. అదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఈ వారంఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. విహార యాత్రలకు వెడతారు. వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవరికీ హామీ ఉండవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అప్పులనుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రే వ్యవహారాలలో ఎదురు చూపులు తప్పవు. దీర్ధకాలంగా పెండింగ్‌లో ఉన్నకోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది.
మిథున రాశి (Gemini): ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి తప్పకపోవచ్చు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. శని, గురు, రాహు గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. స్నేహితులు మిమ్మల్ని అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలునత్తనడక నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారమవుతుంది కానీ, అది మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త
కర్కాటక రాశి (Cancer): అదృష్ట యోగం ఉంది. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది.ఫ్లాటును గానీ, ప్లాటును గానీ సమకూర్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు పలుకుబడిగల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనురూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
సింహ రాశి (Leo): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయానికి, అరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమమీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.
కన్య రాశి (Virgo): ఈ వారం మీకు ఇంటా బయటా మంచి ప్రయోజనాలే చేకూరతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూల౦గా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం తీరు అందోళన కలిగిస్తుంది. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని సమస్యల కారణంగా ఇంట్లో చికాకులు బయలుదేరుతాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహార యాత్రలు చేస్తారు. విద్యార్థులుబాగా శ్రమ పడాల్సి ఉంటుంది. హామీలు ఉండొద్దు.
తుల రాశి (Libra): వ్యాపార, విద్యా, వైద్య రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి విదేశీ సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్ధలం గానీ, ఇల్లు గానీ కొంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లల్లో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్ధులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయండి. అనవసర ఖర్చులు బాగా తగ్గి౦చుకోవాలి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనవు సంపాదనకు అన్ని విధాలా అనుకూలమయిన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. త్వరలో పెల్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్ధులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. స్పెక్యులేషన్‌కు, పెట్టుబడులకు దూరంగా ఉండండి.
ధనస్సు రాశి (Sagittarius): సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల కొత్త గుర్తింపు లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎలిన్నాటి శనివదిలిపోయిన కారణంగా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్ధులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.
మకర రాశి (Capricorn): మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఎలిన్నాటి శని కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఆర్ధిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.అనుకోకుండా బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. నమ్మక ద్రోహానికి అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius): ఈ వారం మీకు పట్టిందల్టా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఇల్లు మారతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. కొందరు సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్ధులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
మీన రాశి (Pisces): కొన్ని వ్యక్తిగత సమస్యలున్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. స్థాన చలనం ఉంది.స్థలంగానీ, ఇల్లు గానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనవనర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్ధులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు పరిష్కారమవుతుంది.