Horoscope Weekly: జన్మ నక్షత్రం, గ్రహాల కదలిక, పేరు బలం ఆధారంగా జ్యోతిష పండితులు రాశి ఫలాలను చెబుతుంటారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ఉద్యగ జీవితం, ఇతర అంశాలను వెల్లడిస్తారు. అవసరమైన వారికి జాగ్రత్తలు కూడా సూచిస్తారు. మరి ఈ వారం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6, 2021 మధ్య మేషం నుంచి మీనం వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇంటా బయట గౌరవాదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధలు తొలగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. అరోగ్యానికి ఢోకా లేదు. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్దులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. గత బకాయిలు కొన్ని వనూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతాన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు, వృత్తి నిపుణులు పురోగతి చెందుతారు. మేథ్స్, ఆర్కియాలజీ, పరిశోధక విద్యార్ధులకు బాగుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. విలువైన వస్తువులు గానీ, డబ్బు గానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్జు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. అరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వ్యాపారం (రంభించాలనుకుంటారు.వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికారు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) గ్రహ సంచారం ప్రకారం కొంత ప్రతికూలత కనిపిస్తోంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటునిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు 'స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్దలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగీ నూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. విద్యార్ధులు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. స౦ఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలున్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. దూర (ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్ధులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఏ పనైనా శ్రమ మీద గానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లోమాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, అరోగ్యానికి లోటు ఉండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ సరిచయాలు పెరుగుతాయి. వృత్తి విద్యల్లో ఉన్నవారు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి (ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్దులకు అనుకూలంగా ఉంది. శ్రేమ వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందినవారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్టు) గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. కొత్త ప్రయత్నాలు వాయిదా వేయండి. అనుకోకుండాకొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావాల్సిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృథా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్ధులకు పరవాలేదు. యాక్సిడెంట్లకు అవకాశం ఉంది. (పేమ వ్యవహారాలు ఫలించి విహార యాత్రలు చేస్తారు.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన నబ్దెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్టు,టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. అరోగ్య౦ చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో శత్రుబాధ ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏలిన్నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య పని ఒత్తిడి, శమ, తిప్పట తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్ధులకు అనుకూలంగా ఉంది. (మేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) అనుకున్నవేవీ ఒక పట్టాన పూర్తి కావు. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర (ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరఖర్చులు పెరిగిపోతాయి. ఏలిన్నాటి శని కారణంగా మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శమపడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఈ వారం మీకు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అరోగ్యానికి, అదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. అతి బెదార్యం వల్ల ఇబ్బందులు పడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్ధులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. (పేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి సమస్యలు తలెత్తుతాయి.